'పాకిస్థాన్‌తో ఆడాలా వద్దా అనేది బీసీసీఐ తుది నిర్ణయం. ఇప్పటి వరకు ఏ విషయం తేలలేదు. కానీ ఆడాల్సి వస్తే సానుకూల ప్రదర్శనే చేస్తాం. ఆస్ట్రేలియా పర్యటన నుంచి నా ఫామ్ మెరుగైంది. ఇంగ్లాండ్, శ్రీలంకలపైనా బౌలింగ్ బాగానే చేశా. ప్రపంచకప్ గెలవడానికి పక్కా ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నాం''
- జులన్ గోస్వామి, భారత సీనియర్ క్రికెటర్
2021 ప్రపంచకప్‌నకు ముందు ఇంగ్లాండ్‌తో గెలవడం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించింది భారత మహిళా క్రికెట్ జట్టు సారథి మిథాలీ రాజ్.
గతంలో మూడు పాయింట్లు తగ్గడం వల్ల క్వాలిఫయర్స్ ఆడాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి రానివ్వం. అవకాశం వస్తే పాక్‌తో ఆడినా పాయింట్ల కోసమే ఆలోచిస్తాం.'
-మిథాలీ రాజ్, భారత వన్డే జట్టు కెప్టెన్
ఐసీసీ ఉమెన్స్ ఛాంపియన్షిప్ పట్టికలో 14 మ్యాచ్‌లు ఆడి 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది భారత్. పాక్ 12 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది టీమిండియా. జులన్ గోస్వామి రెండో వన్డేలో నాలుగు వికెట్ల ప్రదర్శన చేసింది.
- ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ప్రస్తుతం 2-0తో ఆధిక్యంలో ఉంది భారత్. మూడో వన్డేనూ గెలిచి సిరీస్ క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది మహిళా జట్టు. చివరి మ్యాచ్ ఫిబ్రవరి 28న వాంఖడే స్టేడియంలో జరగనుంది.