క్రికెట్ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌పై బీసీసీఐ, పాలకుల కమిటీ(సీఓఏ) ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఒకవేళ మ్యాచ్ ఆడకూడదని అనుకున్నా ఐసీసీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశం ఉందని అంటున్నాయి బీసీసీఐ వర్గాలు.
పాక్ షూటర్ల వీసాకు నో..
దిల్లీలో శనివారం నుంచి జరిగే షూటింగ్ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ క్రీడాకారులు పాల్గొనడం లేదు. వారికి వీసాలు ఇచ్చేందుకు భారత్ నిరాకరించడమే ఇందుకు కారణం.
ఐసీసీ సమావేశంలో చర్చ
భారత్ కూడా ప్రపంచకప్‌లో జూన్ 16న పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించాలన్న విజ్ఞప్తులు వస్తున్నాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 మధ్యలో జరిగే ఐసీసీ సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చే అవకాశం ఉంది.
సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్, మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎదుల్జీ శుక్రవారం దిల్లీలో సమావేశమవనున్నారు. దేశం కోసం సరైన నిర్ణయం తీసుకుంటామని ఎదుల్జీ తెలిపారు.
"పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలన్న ప్రతిపాదనను ఐసీసీ బోర్డు సభ్యుల ముందు పెడితే దానిపై ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. వేరే దేశాలు ఈ విషయమై భారత్‌కు మద్దతిచ్చే అవకాశం తక్కువ" అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. 2021 ఛాంపియన్స్ ట్రోఫీ, 2023 ప్రపంచకప్ ఆతిథ్యంపైనా నీలినీడలు కమ్ముకునే అవకాశం ఉందని తెలిపారు.
భారత క్రికెటర్ హర్భజన్ సింగ్, సౌరవ్ గంగూలీతో పాటు పలువురు పుల్వామా దాడుల నేపథ్యంలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని కోరారు.