స్వదేశంలో ఆస్ట్రేలియాతో రెండు టీ20 మ్యాచ్లు జరగనుండగా... తొలి మ్యాచ్ విశాఖలో నిర్వహిస్తున్నారు. శుక్రవారం విశాఖ చేరుకున్న క్రీడాకారులకు అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారత క్రికెట్ కోచ్ రవిశాస్త్రి సహా సారథి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కృనాల్ పాండ్యా, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్ సాగర నగరంలో అడుగుపెట్టారు.
- ఆసీస్ జట్టు శుక్రవారం సాయంత్రానికి రానుంది. ఇరుజట్లు రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్లో తలపడనున్నాయి. తొలి టీ20 మ్యాచ్ ఆదివారం విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగనుంది.
Back to work 💪 pic.twitter.com/5wWlAn7KMt
— Virat Kohli (@imVkohli) February 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Back to work 💪 pic.twitter.com/5wWlAn7KMt
— Virat Kohli (@imVkohli) February 22, 2019Back to work 💪 pic.twitter.com/5wWlAn7KMt
— Virat Kohli (@imVkohli) February 22, 2019
ధోనీకి నచ్చిన ప్రదేశం:
ధోనీకి క్రికెట్లో పేరు వచ్చింది విశాఖ మ్యాచ్లోనే. చాలా సార్లు విశాఖ అంటే ప్రత్యేక అభిమానమని చెప్పిన మిస్టర్ కూల్...అందరికంటే ముందుగా గురువారమే విశాఖకు చేరుకున్నాడు.
- View this post on Instagram
Mahi reached Vizag for the first t20 against Australia ❤️ V.c-@bleed.dhonism
">
- మంచి రికార్డు:
ఫిబ్రవరి 24 ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. తొలి టీ20కి ఆతిథ్యమిస్తోన్న విశాఖ స్టేడియంలో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. మూడేళ్ల క్రితం భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక ఆడిన టీ20 మ్యాచే ఇక్కడ చివరి మ్యాచ్. అయితే ఈ మ్యాచ్ విజయంతో సిరిస్‌నూ కైవసం చేసుకుంది టీమిండియా.