ముంబయి వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో 202 పరుగులకే ఆలౌట్ అయింది భారత మహిళా జట్టు. ఇంగ్లండ్ బౌలర్లు విజృంభించి టీమిండియాను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.
ఓపెనింగ్ ఓకే కానీ..
తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభాన్నిచ్చారు ఓపెనర్లు. రోడ్రిగ్స్ 48 పరుగులతో ఆకట్టుకోగా, స్మృతి మంధాన 24 పరుగులకు వెనుదిరిగింది. మొదటి వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పాటు కెప్టెన్ మిథాలీ రాజ్(44 పరుగులు) మినహా మిగిలిన వారు తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు.
ముగ్గురు డకౌట్
భాటియా 25 పరుగులు చేయగా, పేసర్ జులన్ 30 పరుగులు చేశారు. మోనా, ఏక్తా బిస్త్, పూనం యాదవ్ డకౌట్‌గా వెనుదిరిగారు.
బౌలర్ల ఆధిపత్యం..
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఇంగ్లీష్ బౌలర్లు కళ్లెం వేశారు. పరుగులను నియంత్రిస్తూ.. వెంట వెంటనే వికెట్లు తీస్తూ అతిథ్య జట్టును ఆత్మరక్షణలోకి నెట్టేశారు.
ఇంగ్లండ్ బౌలర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన సోఫి కేవంల 27 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసింది. మిగతా బౌలర్లు స్కీవర్, ఎల్విస్.. చెరో రెండు వికెట్లు పడగొట్టారు.అన్యా ఒక వికెట్ తీసింది.