ETV Bharat / cricket

జోరు కొనసాగేనా... - క్రికెట్

భారత్-ఇంగ్లాండ్ మహిళా వన్డే సిరీస్ రెండో మ్యాచ్​కు అంతా సిద్ధమైంది. మొదటి వన్డేలో గెలిచి ఊపుమీదున్న మిథాలీ సేన మరో మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

భారత జట్టు
author img

By

Published : Feb 24, 2019, 5:21 PM IST

ప్రపంచ ఛాంపియన్​ను మొదటి మ్యాచ్​లోనే ఓడించి రెట్టించిన ఉత్సాహంతో ఉంది భారత్. వాంఖడే వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా తక్కువ స్కోరుకే పరిమితమైనా.. స్పిన్నర్ ఏక్తా బిస్త్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్​పై 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. బిస్త్​తో పాటు లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్, దీప్తి శర్మ మిడిల్ ఓవర్లలో పరుగులు కట్టడి చేయడంలో సఫలమయ్యారు.

బ్యాటింగ్ విభాగంలో యంగ్ ఓపెనర్ రోడ్రిగ్స్ మంచి ఫామ్​లో ఉండగా మరో ఓపెనర్ స్మృతి మంధాన మొదటి మ్యాచ్​లో 24 పరుగులకే పరిమితం అయింది. కెప్టెన్ మిథాలీ 44 పరుగులు చేసింది. వీరిరువురు రెండో వన్డేలో సత్తా చాటాలని జట్టు భావిస్తోంది. మిడిల్ ఆర్డర్ సమస్య నుంచి కోలుకుని రెండో వన్డేలో గెలవాలని మిథాలీ సేన పట్టుదలతో ఉంది.

ఉపఖండ పిచ్​లపై భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం ఏ జట్టుకైనా ఇబ్బందే. మొదటి వన్డేలో ఇంగ్లాండ్ బ్యాట్స్​మెన్ పతనానికి కారణం కూడా అదే. రెండో వన్డేలో ఎదురుదాడికి దిగాలని బ్రిటిష్ జట్టు అనుకుంటోంది. బౌలింగ్ విభాగంలో పటిష్టంగా కనబడుతోంది ఆతిథ్య జట్టు. మొదటి మ్యాచ్​లో ఓడినా ఈ వన్డేలో గెలిచి సిరీస్ ఆశలు నిలుపకోవాలని అనుకుంటోంది.

ఈ సిరీస్ గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని భారత్ భావిస్తోంది. ప్రపంచకప్​కు నేరుగా అర్హత సాధించాలంటే టాప్ ఫోర్​లో ఉండాలి. ప్రస్తుతం భారత్ మూడో స్థానంలో ఉంది.

ఇవీ చదవండి..కోహ్లీ సేనకు సవాల్

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.