పుల్వామా దాడిపై ఆగ్రహ జ్వాలలు చల్లారేలాలేవు. తాజాగా ముంబయిలోని 'క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా' భవనంలో ఉన్న పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ఆ దేశ ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చిత్రాన్ని ఓ వస్త్రంతో కప్పేశారు.


క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా సెక్రటరీ సురేష్ బఫ్నా స్పందిస్తూ 'పుల్వామా ఉగ్రదాడిపై సంతాపం తెలియజేసేందుకు సమావేశం నిర్వహించాం.. హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న ఇమ్రాన్ ఫొటోను కప్పివేయాలని నిర్ణయించాం. ఆ ఫొటోను ఎలా తొలగించాలనే విషయాన్ని త్వరలో నిర్ణయిస్తాం' అని తెలిపారు.