ETV Bharat / cricket

ప్రథమ స్థానంలో స్మృతి మంధానా - MITHALI RAJ

ఐసీసీ వన్డే మహిళల ర్యాంకింగ్స్​లో స్మృతి మంధానా మొదటి స్థానంలో కొనసాగుతోంది.

స్మృతి మంధాన
author img

By

Published : Feb 18, 2019, 11:56 PM IST

సోమవారం విడుదలైన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​లో భారత బ్యాట్ ఉమెన్ స్మృతి మంధాన 774 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎల్లీస్ పెర్రీ రెండో స్థానంలో, మేగ్ లానింగ్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

న్యూజిలాండ్ క్రికెటర్ ఆమీ సాత్తర్​వైట్ నాలుగో స్థానంలో ఉంది. టీమిండియా వన్డే సారథి మిథాలీ రాజ్ ఐదవ స్థానాన్ని సంపాదించుకుంది. వీరు కాకుండా మొదటి 20లో భారత జట్టు నుంచి దీప్తి శర్మ 17వ స్థానంలో, హర్మన్ ప్రీత్ కౌర్ 19వ స్థానంలో ఉన్నారు.

వెస్టిండీస్ మహిళ జట్టు కెప్టెన్ స్టాఫనీ టేలర్.. రెండు స్థానాలు ఎగబాకి 8వ స్థానం పొందింది.

బౌలర్ల విషయంలో భారత్ నుంచి పేసర్ జులన్ గోస్వామి మూడో స్థానంలో ఉండగా, పాక్ బౌలర్ సనా మీర్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానంలో ఆస్ట్రేలియా నుంచి మేగన్ స్కాట్ ఉంది. జులన్ కాకుండా దీప్తి శర్మ 8లో ఉండగా, పూనం యాదవ్ 9వ స్థానం సొంతం చేసుకుంది.

ఆల్​రౌండర్​ల జాబితాలో భారత్ నుంచి దీప్తి శర్మ కెరీర్​లో అత్యుత్తమంగా ముడో స్థానం పొందింది. ఆస్ట్రేలియా నుంచి ఎల్లిస్ పెర్రీ మొదటి స్థానంలో ఉండగా, వెస్టిండీస్ ఆల్​రౌండర్ టేలర్ రెండులో కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి:ప్రపంచకప్​@100 రోజులు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.