శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్యపై రెండేళ్ల నిషేధం విధించింది ఐసీసీ. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ మాజీ క్రికెటర్ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
విచారణను అడ్డుకోవడం లేదా వాయిదా వేయడం చేస్తే అవినీతి నిరోధక విభాగం-ఏసీయూ నిబంధనల ప్రకారం నేరమని జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ తెలిపారు. ఐసీసీ కోడ్ ప్రకారం ప్రతి ఒక్కరూ విచారణకు సహకరించాలని అన్నారు. అందరికీ నిర్ణయం ఒకేలా ఉంటుందని స్పష్టం చేశారు.
BREAKING: Sanath Jayasuriya has been banned from all cricket for two years after admitting breaching two counts of the ICC Anti-Corruption Code.https://t.co/6VdTP6I2jL
— ICC (@ICC) February 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">BREAKING: Sanath Jayasuriya has been banned from all cricket for two years after admitting breaching two counts of the ICC Anti-Corruption Code.https://t.co/6VdTP6I2jL
— ICC (@ICC) February 26, 2019BREAKING: Sanath Jayasuriya has been banned from all cricket for two years after admitting breaching two counts of the ICC Anti-Corruption Code.https://t.co/6VdTP6I2jL
— ICC (@ICC) February 26, 2019
ఐసీసీ అవినీతి నిరోధక నిబంధనావళిని జయసూర్య రెండు విధాలుగా ఉల్లంఘించారని ఐసీసీ పేర్కొంది.
- ఆర్టికల్ 2.4.6 ప్రకారం న్యాయ విచారణకు హాజరుకాకపోవడం లేదా తిరస్కరించడం, అడిగిన సమాచారాన్ని ఇవ్వకపోవడం ఇందులో ఉన్నాయి.
- ఆర్టికల్ 2.4.7 ప్రకారం విచారణను ఆలస్యం చేయడం, పత్రాలు చించడం, సాక్ష్యాలను పాడుచేయడం వంటివి ఉన్నాయి.
దొంగ పేర్లతో కంపెనీలు నడిపించడం, పన్ను ఎగ్గొట్టడం వంటి కేసుల్లో జయసూర్య ఐసీసీ విచారణ ఎదర్కొంటున్నాడు.
1996లో శ్రీలంక ప్రపంచప్ విజయంలో జయసూర్యది కీలకపాత్ర. అనంతరం సెలక్షన్ కమిటీకి రెండు సార్లు ఛైర్మన్ గా చేశాడు.