సాగర నగరంలో క్రికెట్ సందడి మొదలైంది. యువత స్టేడియం వెలుపల జాతీయ పతాకలు, రంగులతో అలంకరణలు చేసుకొని సిద్ధమౌతున్నారు. మ్యాచ్ ప్రారంభానికి రెండు గంటల ముందు ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 4 గంటల తర్వాత స్టేడియం మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి.
- స్టేడియం పూర్తి సామర్థ్యం 27,500 కాగా అన్ని టికెట్లు అమ్ముడైనట్లు అధికారులు వెల్లిడించారు. సుమారు 1,400 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.