భారత పేసర్ బుమ్రా..టీట్వంటీల్లో మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన టీట్వంటీలో 3 వికెట్లు తీసిన బుమ్రా.. భారత్ తరఫున వేగంగా 50 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. మరో మూడు వికెట్లు తీస్తే మొదటి స్థానంలో ఉన్న అశ్విన్‌ను అధిగమిస్తాడు.
రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం 54 వికెట్లతో పొట్టి ఫార్మాట్లో భారత్ తరఫున అగ్రస్థానంలో ఉన్నాడు. చివరిసారిగా 2017లో వెస్టిండీస్‌తో టీట్వంటీ ఆడాడీ స్పిన్నర్. చాహల్, కుల్దీప్ రాకతో అశ్విన్‌కు జట్టులో స్థానమే కష్టమైంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌లోనే బుమ్రా ఈ రికార్డు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
బుమ్రా ప్రస్తుతం 41 మ్యాచ్‌ల్లో 19.58 సగటుతో 51 వికెట్లు తీశాడు.
గతేడాది రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది 98 వికెట్లతో ఈ ఫార్మాట్లో మొదటి స్థానంలో ఉన్నాడు.