బిగ్‌బాష్ లీగ్ ఫైనల్ పోరులో మెల్‌బోర్న్ స్టార్స్‌పై మెల్‌బోర్న్ రెనిగేడ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని గెలుచుకుంది. ఇది రెనిగేడ్స్‌కు తొలి బీబీఎల్ టైటిల్. మొదట టాస్ గెలిచిన మెల్‌బోర్న్ స్టార్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన అరోన్ ఫించ్ నేతృత్వలోని రెనిగేడ్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. రెనిగేడ్స్ టాప్ ఆర్డర్ విఫలమైనా...ఆరో స్థానంలో వచ్చిన టామ్ కూపర్(43*), డానియల్ క్రిస్టియన్(38*)తో కలిసి 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరద్దరి వల్లా గౌరవప్రదమైన స్కోరును రెనిగేడ్స్ సాధించింది.
Straight to the pool room. #GETONRED #BBL08 pic.twitter.com/o4hgWpu1Yh
— Melbourne Renegades (@RenegadesBBL) February 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Straight to the pool room. #GETONRED #BBL08 pic.twitter.com/o4hgWpu1Yh
— Melbourne Renegades (@RenegadesBBL) February 17, 2019Straight to the pool room. #GETONRED #BBL08 pic.twitter.com/o4hgWpu1Yh
— Melbourne Renegades (@RenegadesBBL) February 17, 2019
- 146 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన మెల్‌బోర్న్ స్టార్స్‌కు మంచి శుభారంభం లభించింది. ఆ జట్టు ఓపెనర్లు బెన్ డంక్(57), మార‍్కస్ స్టోనిస్(39)లు కలసి తొలి వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యంతో విజయం దిశగా నడిపించారు.
కొంప ముంచిన ధీమా:
సులభంగా గెలిచేస్తాం అనుకున్న స్టార్స్ జట్టులో ఓపెనర్ల తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో ఆడమ్ జంపా(17) తప్ప ఇంకెవరూ రెండంకెల స్కోరు దాటడం కష్టమైంది. 19 పరుగుల వ్యవధిలో 7 వికెట్లను చేజార్చుకుని పరాజయం పొందింది స్టార్స్ జట్టు. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెనిగేడ్స్ బౌలర్లలో డానియల్ క్రిస్టియన్, కామెరూన్ , క్రిస్ ట్రిమాన్‌లు రెండేసి వికెట్లు సాధించారు.
- అలారం మోత:
మార్వెల్ స్టేడియంలో జరిగిన బిగ్‌బాష్ లీగ్ ఫైనల్లో ఫైర్ అలారం సంచలనమైంది. మ్యాచ్‌కు అరగంట ముందు ఈ అలారం మోగింది. అప్రమత్తమైన అధికారులు స్టేడియంలోని ప్రేక్షకులను బయటకు పంపారు. తరవాత అది ఉత్తుత్తిగా మోగిందని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. అలారంలోని సాంకేతిక లోపం కారణంగా అకస్మాత్తుగా సౌండ్ వచ్చిందని వెల్లడించింది అగ్నిమాపక దళం. ఆ మోతకు ఆటగాళ్లు సైతం భయపడ్డారని వ్యాఖ్యాత మార్క్ వెల్లడించాడు.