బెంగళూరు వేదికగా జరిగిన రెండో టీ20లో పర్యటక ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో ఛేదించింది. చివరి వరకూ ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో ఒత్తిడిని తట్టుకుని సిరీస్ కైవసం చేసుకుంది. మాక్స్వెల్ 113 పరుగులతో భారత్ పతనాన్ని శాసించాడు.
మాక్స్వెల్ షో..
ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో మాక్స్వెల్ ఆటే హైలెట్. గత మ్యాచ్‌లో 56 పరుగులతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు మాక్సీ. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ 113 పరుగులు చేసి సిరీస్ కంగారూల సొంతమయ్యేలా చేశాడు. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డులనూ సొంతం చేసుకున్నాడు మాక్స్వెల్.
An outstanding knock of 113* from Maxwell guides the visitors to a 7-wkt victory in the second T20I.
— BCCI (@BCCI) February 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Australia win the series 2-0 #INDvAUS pic.twitter.com/CAdMFQdBa5
">An outstanding knock of 113* from Maxwell guides the visitors to a 7-wkt victory in the second T20I.
— BCCI (@BCCI) February 27, 2019
Australia win the series 2-0 #INDvAUS pic.twitter.com/CAdMFQdBa5An outstanding knock of 113* from Maxwell guides the visitors to a 7-wkt victory in the second T20I.
— BCCI (@BCCI) February 27, 2019
Australia win the series 2-0 #INDvAUS pic.twitter.com/CAdMFQdBa5
మిగతా ఆటగాళ్లలో షార్ట్ 40 పరుగులు చేయగా, హాండ్స్‌కాంబ్ 20 పరుగులతో విజయంలో భాగం పంచుకున్నాడు.
తేలిపోయిన భారత బౌలింగ్
గత మ్యాచ్‌లానే చివరి వరకు విజయం దోబూచులాడిన ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ ప్రత్యర్థి ముందు తేలిపోయింది. మన బౌలర్లలో విజయ శంకర్ ఒక్కడే రెండు వికెట్లు తీశాడు. ఉమేశ్ స్థానంలో జట్టులోకి వచ్చిన కౌల్.. ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. చాహల్, బుమ్రా, కృనాల్ పరుగులిచ్చారు తప్ప ఆసీస్‌ను కట్టడి చేయలేకపోయారు.
ఆకట్టుకున్న కోహ్లీ
టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్‌కు ఓపెనర్లు ధవన్, రాహుల్ అదిరే ఆరంభం ఇచ్చారు. మొదటి వికెట్‌కు 61 పరుగులు జోడించారు. 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ ఔటయ్యాడు.
తర్వాత కాసేపటికే ధావన్, పంత్ వెనుదిరిగారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ, ధోని.. వికెట్లు పడకుండా ఆడుతూనే వీలు చిక్కినప్పుడు బౌండరీలు సాధించారు. నాలుగో వికెట్‌కు వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అనంతరం.. 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ధోని వెనుదిరిగాడు. మరో ఎండ్‌లో 72 పరుగులతో కోహ్లీ నాటౌట్‌గా నిలిచాడు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 190 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఆసీస్ బౌలింగ్ అంతంతమాత్రమే..
గత మ్యాచ్‌లో భారత్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేసిన ఆసీస్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో చేతులెత్తేశారు. జేసన్ మినహా మిగతా వారందరూ ధారాళంగా పరుగులిచ్చేశారు. కౌల్టర్‌నైల్, షార్ట్, కమిన్స్, జేసన్ తలో వికెట్ తీశారు.