ETV Bharat / cricket

ఒకే ఇన్నింగ్స్​తో రికార్డుల మోత

అఫ్గానిస్థాన్​-ఐర్లాండ్ మధ్య దేహ్రాదూన్​లోని రాజీవ్​ అంతర్జాతీయ క్రికెట్​ స్టేడియంలో రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్​లో అఫ్గాన్​ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్​ విధ్వంసకర బ్యాటింగ్​ చేశాడు. ఎంతగా చెలరేగాడంటే కేవలం 62 బంతుల్లో 162 పరుగులు బాదేశాడు. ఫలితంగా అఫ్గాన్​ జట్టు 84 పరుగుల తేడాతో విజయం సాధించి టీ20 సిరీస్​ సొంతం చేసుకుంది.

ఆఫ్గాన్​ కుర్రాడి నయా చరిత్ర
author img

By

Published : Feb 23, 2019, 11:39 PM IST

ఉత్తరాఖండ్​లో మంచు కురవడమే విన్నాం కాని తొలిసారి సునామీ వచ్చింది. అది ప్రకృతి వల్ల కాదు ఓ 20 ఏళ్ల కుర్రాడు బ్యాట్​తో పరుగుల సునామీ సృష్టించాడు. ఎంతగా అంటే ప్రపంచ క్రికెట్​ దేశాలన్నీ మాట్లాడుకునేలా... అతడే అప్ఘాన్​ దేశానికి చెందిన హజ్రతుల్లా జజాయ్​.

62 బంతుల్లో 162 పరుగులు:

undefined

62 బంతుల్లో 162 పరుగుల స్కోరు సాధించి క్రికెట్​ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేశాడు హజ్రతుల్లా. మ్యాచ్​లో 11 ఫోర్లు, 16 సిక్స్​లు బాదిన ఈ కుర్రాడు ఆ ఘనతను సాధించాడు.

  • సిక్స్​ల వీరుడు...

హజ్రతుల్లా జజాయ్​ కి ఇది ఐదో మ్యాచ్. ప్రపంచంలోనే ఒక మ్యాచ్​లో ఎక్కువ సిక్స్​లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ఏజే ఫించ్​ 14 సిక్సుల పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టేశాడు.

  • రికార్డులు...

హజ్రతుల్లా పరుగుల వరదకు అఫ్గాన్​ జట్టు 20 ఓవర్లలో 278 పరుగులు చేసింది. ఇది టీ20 క్రికెట్​ చరిత్రలో అత్యధిక స్కోరు.

  • 2016లో ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరిగిన టీ20 మ్యాచ్​లో నమోదైన 263 పరుగులే ఇప్పటి వరకు రికార్డుగా ఉండేది.

పెద్దల సరసన:

క్రిస్​ గేల్​, ఆరోన్​ ఫించ్​ లాంటి ఆటగాళ్లు విధ్వంసకర బ్యాటింగ్​కు పెట్టింది పేరు...కాని ఈ కుర్రాడు ఒక మ్యాచ్​తో వారి సరసన చేరాడు. ప్రపంచంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన టీ20 క్రికెటర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

undefined
  • తొలిస్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు ఏజే ఫించ్​ (172) ఉన్నాడు.
  • ఐపీఎల్​లో క్రిస్​ గేల్​ (175) పరుగులు అత్యధికం.

మూడో మొనగాడు:
42 బంతుల్లో శతకం కొట్టి సంచలనం సృష్టించాడు హజ్రాతుల్లా. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా ఆటగాడు మిల్లర్, భారత ఆటగాడు రోహిత్​ శర్మ 35 బంతుల్లో శతకాలు కొట్టి ముందు వరుసలో ఉన్నారు.​

  • రికార్డు భాగస్వామ్యం​...

ఈ మ్యాచ్​లో ఉస్మాన్​ ఘనితో కలిసి 236 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇది ప్రపంచ క్రికెట్​ చరిత్రలో అత్యధిక పార్టనర్ షిప్​.

  • And that's the world record for the highest partnership in T20Is beating Australia's Aaron Finch and Darcy Short's 223 run stand.
    It has been an Absolute carnage by @zazai_3 and well supported by Usman Ghani !#AFGvIRE pic.twitter.com/iPIX7sqbiy

    — Afghanistan Cricket Board (@ACBofficials) February 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.