83వ జాతీయ సీనియర్ పురుషుల బ్యాడ్మింటన్ పోటీల్లో సౌరభ్ వర్మ విజేతగా నిలిచాడు. ప్రత్యర్థి లక్ష్య సేన్‌పై 21-18, 21-13 తేడాతో గెలుపొంది హ్యట్రిక్ టైటిల్స్ సాధించాడు. ఇంతకు ముందు 2011, 2017లో ఈ పోటీలో విజేతగా నిలిచాడు.
వీరిద్దరు ఇంతకుముందు 2017 జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ పోటీలో తలపడ్డారు. అప్పుడూ సౌరభ్ విజేతగా నిలిచాడు. యువ ఆటగాడైన లక్ష్యసేన్ చేసిన చిన్న చిన్న తప్పులు అతని ఓటమికి కారణమయ్యాయి.
పురుషుల డబుల్స్‌లో జెర్రీ చోప్రా, చిరాగ్ శెట్టి జోడీ.. టాప్ సీడ్ అర్జున్, స్లోక్ రామ్‌చంద్రన్ జోడీపై 21-13, 22-20 తేడాతో గెలుపొంది విన్నర్స్‌గా నిలిచారు. ఈ ఆట కేవలం 33 నిమిషాలే సాగింది.
![జెర్రీ చోప్రా-చిరాగ్ శెట్టి జోడీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/2468276_dobles_chandu.jpg)
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)