దిల్లీలో జరుగుతున్న షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ మరో బంగారు పతకం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలో మను బాకర్-సౌరభ్ చౌదరి జంట స్వర్ణాన్ని సొంతం చేసుకుంది.
చైనా, కొరియాలను వెనక్కి నెట్టి 483.4 పాయింట్లతో అగ్రస్థానం సంపాదించింది భారత్. చైనా 477.7 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్ విభాగంలో 245 పాయింట్లతో ప్రపంచ రికార్డు సాధించాడు సౌరభ్.
మరో భారత బృందం హీనా సిద్ధూ- అభిషేక్ వర్మ క్వాలిఫికేషన్ రౌండ్‌ను అధిగమించలేకపోయింది.
2020 టోక్యో ఒలింపిక్స్‌లో 14 బెర్తులు ఈ ప్రపంచకప్ నుంచే భర్తీ కానున్నాయి. 3 గోల్డ్ మెడల్స్‌తో భారత్ హంగేరీతో కలిసి పతకాల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కానీ, ఇప్పటివరకు ఒక్క ఒలింపిక్ బెర్తునే ఖాయం చేసుకుంది.