ETV Bharat / athletics

16 ఏళ్లకే ప్రపంచకప్ పసిడి

8 మంది తలపడిన తుదిపోరులో.. రెండో స్థానంలో నిలిచిన డామీ మికెక్ కంటే 5.7 పాయింట్లు అధికంగా తెచ్చుకున్నాడు సౌరభ్ చౌదరి.

సౌరభ్
author img

By

Published : Feb 24, 2019, 4:31 PM IST

దిల్లీలో అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్(ఐఎస్​ఎస్​ఎఫ్​) ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచకప్ పోటీల్లో భారత్ మరో బంగారు పతకం గెల్చుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్​ ఈవెంట్​లో సౌరభ్ చౌదరి 245 పాయింట్లు సాధించి స్వర్ణం చేజిక్కుంచుకున్నాడు.

సెర్బియాకు చెందిన డామీ మికెక్ 239.3 పాయింట్లతో రజతం గెల్చుకోగా, చైనా షూటర్ వెయి పాంగ్ 215.2 స్కోరుతో కాంస్యాన్ని దక్కించుకున్నాడు. 8 మంది తలపడిన తుదిపోరులో రెండో స్థానంలో నిలిచిన డామీ కంటే 5.7 పాయింట్లు అధికంగా తెచ్చుకున్నాడీ 16 ఏళ్ల కుర్రాడు. చివరి షాట్ కంటే ముందే గోల్డ్​ని తన ఖాతాలో వేసుకున్నాడు సౌరభ్.

తాజా ప్రదర్శనతో 2020లో జరగనున్న టోక్యో ఒలింపిక్స్​కి మార్గాన్ని సుగమం చేసుకున్నాడు సౌరభ్. గతేడాది ఆసియన్ గేమ్స్​లోనూ సత్తా చాటిన సౌరభ్ ఐఎస్​ఎస్​ఎఫ్ జూనియర్ ఛాంపియన్​షిప్​లోనూ పుత్తడి కైవసం చేసుకున్నాడు

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.