వాణిజ్య ఒప్పందాలు, బ్రాండ్ అంబాసిడర్లుగా ఒకప్పుడు క్రికెటర్లకు ప్రాధాన్యమిచ్చేవాళ్లు. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఈ మధ్యే చైనా క్రీడా ఉత్పత్తుల కంపెనీ పీవీ సింధుతో భారీ వాణిజ్య ఒప్పందం చేసుకోగా... తాజాగా ప్యూమా కంపెనీ.. భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది.
రెండేళ్ల కాలానికిగాను మహిళల శిక్షణా విభాగంలో రాయబారిగా ఒప్పందంపై సంతకం చేసిందీ మణిపూర్ మణిపూస. ఇద్దరు పిల్లలకు తల్లయినా బాక్సింగ్‌లో తనను తాను నిరూపించుకుంటూ ఎందరో భారతీయ మహిళలకు ఆదర్శంగా నిలిచింది.
"నా జీవితంలో మహిళగా, తల్లిగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. వీటిని అధిగమించడంలో నాకు సహకరించిన నా కుటుంబానికి, బృందానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్యూమా సంస్థ మహిళలకు మద్దతిస్తూ ప్రోత్సహిస్తోంది. ఎప్పుడూ ఈ సంస్థను విశ్వసిస్తాను"
-మేరీకోమ్