ETV Bharat / tv-and-theater

ఆస్కార్ నాయకుడెవరో.. - AWARDS

ఆస్కార్  ​ఉత్తమ నటుడి విభాగంలో  ఆస్కార్​ ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఈ సారి ఆస్కార్​ ఉత్తమ నటుడి బరిలో ఉన్న వారిలో ఒక్కరు మినహా మిగిలిన వారందరూ ఇంతకు ముందు ఏదో ఒక విభాగానికి నామినేట్ అయిన వారే.

ఆస్కార్
author img

By

Published : Feb 24, 2019, 4:49 PM IST

ఆస్కార్... ప్రతీ నటుడు ఈ పురస్కారాన్ని కనీసం ఒక్కసారైనా అందుకొని ముద్దాడాలని అనుకుంటాడు. ఇప్పటికి 90 సార్లు ఎందరో నటులు కైవసం చేసుకున్న ఈ బంగారు ప్రతిమ... 91వ సారి ఎవరిని వరించనుందో మరికొన్ని గంటల్లో తేలనుంది. అమెరికా లాస్​ఏంజిల్స్​లోని డాల్బీ థియేటర్లో జరిగే ఆస్కార్ ప్రదానోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

క్రిస్టియన్ బేల్: వైస్

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
క్రిస్టియన్ బేల్​ ఇప్పటికే ఓ సారి ఈ అవార్డుని ముద్దాడాడు. అమెరికా చరిత్రలోనే శక్తిమంతమైన ఉపరాష్ట్రపతిగా పేరున్న డిక్ చినీ పాత్రను 'వైస్' చిత్రంలో పోషించాడు బేల్. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ హయాంలో 2001 నుంచి 2009 వరకు డిక్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఈయన జీవితం ఆధారంగా తెరకెక్కిన 'వైస్' చిత్రంలో ప్రధాన పాత్రను పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు బేల్. ఇప్పటికే ఈ చిత్రంలో తన నటనకు గోల్డెన్​గ్లోబ్​తో సహా పలు అవార్డులను పొందాడు.గతంలో ది ఫైటర్ చిత్రంలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడు విభాగంలో ఆస్కార్ పొందాడీ ఇంగ్లీష్ నటుడు.

బ్రాడ్లీ కూపర్: ఏ స్టార్ ఈజ్ బోర్న్

బ్రాడ్లీ కూపర్ స్వయంగా దర్శకత్వం వహించి నటించిన చిత్రం 'ఏ స్టార్ ఈజ్ బోర్న్' 1937లో వచ్చిన స్టార్ ఈజ్ బోర్న్ చిత్రాన్ని అదే పేరుతో రీమేక్ చేశాడు బ్రాడ్లీ. 40 మిలియన్ డాలర్లు(240 కోట్లు)తో తెరకెక్కిన ఈ చిత్రం 423 మిలియన్ డాలర్లను(2400 కోట్లు) రాబట్టి మంచి విజయం సాధించింది. అటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. కెరీర్ చరమాంకంలో ఉన్న పాప్ గాయకుడికి... ఓ క్లబ్ గేయని మధ్య సాగే ప్రేమగాథ ప్రేక్షకులతో కన్నీరు పెట్టించింది. జాక్సన్ అనే గాయకుడి పాత్రలో బ్రాడ్లీ కూపర్ ఒదిగిపోయాడు.

ప్రముఖ గాయని లేడీ గాగా ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. ఉత్తమ నటుడు, నటి సహా 8 ఆస్కార్ విభాగాల్లో పోటీపడుతోందీ చిత్రం. గతంలో అమెరికన్ స్నైపర్ చిత్రానికి గాను ఆస్కార్​కు నామినేట్ అయినా... బ్రాడ్లీని అవార్డు వరించలేదు. రెండో సారి ఈ పురస్కారం కోసం పోటీపడుతున్నాడు. 2013లో హిందీలో వచ్చిన ఆషికీ2 కూడా ఈ చిత్ర కథాంశమే.

విలియం డఫో: ఎట్ ఎటర్నిటీస్ గేట్

18వ శతాబ్దపు ప్రఖ్యాత పెయింటింగ్ కళాకారుడు విన్సెంట్ వాన్ గో జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఎట్ ఎటర్నిటీస్ గేట్'. విన్సెంట్ పాత్రను ప్రముఖ హాలీవుడ్ నటుడు విలియం డఫో పోషించాడు. 37 ఏళ్లకే మరణించిన విన్సెంట్ జీవితంలో ఆసక్తికర సంఘటనలు తెరపై చూపించాడు దర్శకుడు. చిత్రంలో విలియం నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. విలియం ఇప్పటికే మూడు సార్లు ఆస్కార్​కు నామినేట్ అయినా.. ఒక్కసారి కూడా అందుకోలేదు. నాలుగోసారైనా అతని అకాడమీ కల నెరవేరుతుందో లేదో చూడాలి.

రమి మాలెక్: బొహిమియన్ రాప్సోడీ

'బొహిమియన్ రాప్సోడీ' చిత్రంలో నటనకు గాను ఇప్పటికే ఉత్తమ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ అందుకున్న రమి మాలెక్ అకాడమీపై కన్నేశాడు. గతేడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఏడో స్థానంలో ఉన్న ఈ సినిమా పలు అంతర్జాతీయ పురస్కారాలు గెల్చుకుంది. 800 మిలియన్ డాలర్ల(4800 కోట్లు) పైచిలుకు కలెక్షన్లు సొంతం చేసుకున్న ఈ సినిమా... ఆస్కార్ ప్రతి విభాగాంలోనూ పోటీకి నిలిచింది. తొలిసారి ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయిన రమి మాలెక్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

విగ్గో మొర్టెన్​సెన్: గ్రీన్ బుక్

2008, 2017లో రెండుసార్లు ఉత్తమ నటుడి విభాగంలో ఆస్కార్​కు పోటీ పడిన విగ్గో మొర్టెన్​సెన్ ముచ్చటగా మూడోసారి బరిలో ఉన్నాడు. ఈ సారైనా అవార్డు గెలవాలని తహతహలాడుతున్నాడు. బయోలాజికల్ కామెడీగా తెరకెక్కిన 'గ్రీన్​బుక్'లో విగ్గో మొర్టెన్​సెన్ నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం ఇద్దరు స్నేహితుల మధ్య సంఘర్షణల ఆధారంగా తెరకెక్కింది. మంచి విజయాన్ని అందుకుని ఆస్కార్ బరిలో బలమైన పోటీనిస్తోంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయనటుడుతో సహా ఐదు విభాగాల్లో పోటీపడుతుంది.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.