ETV Bharat / tv-and-theater

పాకిస్థాన్​​కే నష్టం - indian

భారతీయ చిత్రాలు పాకిస్థాన్​లో సగటున 4 నుంచి 7 కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తాయి. అత్యధికంగా సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ చిత్రం 37 కోట్ల రూపాయలను కొల్లగొట్టిందని ఎగ్జిబిటర్ అక్షయ్ రతి తెలిపారు.

పాకిస్థాన్
author img

By

Published : Feb 24, 2019, 5:08 PM IST

పాక్​లో భారతీయ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. అందులోనూ బాలీవుడ్ సినిమాలకు అక్కడ ప్రేక్షకులు ఫిదా అయిపోతారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం పాక్​లో సినిమాలు విడుదల చేయట్లేదని పలు హిందీ సినిమాల నిర్మాతలు ప్రకటించారు. పొరుగు దేశంలో భారతీయ చిత్రాలు విడుదల కానంత మాత్రాన చిత్ర పరిశ్రమపై అంత ప్రభావమేమీ ఉండదని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ అభిప్రాయపడ్డారు.

"పాకిస్థాన్​లో దాదాపు 150 స్క్రీన్లు ఉన్నాయి. మన లాగే వాళ్లూ హిందీ చిత్రాలంటే ఎక్కువ ఇష్టపడతారు. హాలీవుడ్ చిత్రాలు ఏడాదిలో కొన్ని మాత్రమే వస్తాయి. అందుకే భారతీయ సినిమాలవైపే మక్కువ చూపుతారు. పాక్ మార్కెట్ చాలా చిన్నది. దీనివల్ల వారే ఎక్కువ నష్టపోతారు" -తరణ్​ ఆదర్శ్, సినీ విశ్లేషకుడు

తరణ్ విశ్లేషణను బట్టి పాకిస్థాన్ చిత్ర ప్రదర్శన రంగం ఎక్కువ నష్టపోతుందని అక్షయ్ రతి అనే ఎగ్జిబిటర్ తెలిపారు. ఇప్పటికే టోటల్ ధమాల్, లూకా చుప్పి, అర్జున్ పటియాలా, నోట్​బుక్, కబీర్ సింగ్ లాంటి చిత్రాలు పాక్​లో​ విడుదల చేయట్లేదంటూ ఆయా సినిమాల నిర్మాతలు ప్రకటించారు.

"భారతీయ చిత్రాలు పాకిస్థాన్​లో సగటున 4 నుంచి 7 కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తాయి. అత్యధికంగా సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ చిత్రం 37 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. అనంతరం అమీర్​ఖాన్ పీకే, దూమ్-3 చిత్రాలు 25, 22 కోట్లు సాధించాయి." -అక్షయ్ రతి,ఎగ్జిబిటర్

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.