వినోదపు పన్ను 28 నుండి 18 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. గతనెల జనవరి నుండి తగ్గించిన జీఎస్టీ ధరలతో అమ్మకాలు జరపాల్సి ఉంది. అయితే మహేశ్ బాబు ఏఎంబీ సినిమాస్ మాత్రం కేంద్రం ఆదేశాలను పట్టించుకోకుండా యథాతథంగా టికెట్లు అమ్మి...35 లక్షలు ఆర్జించినట్లు ఆరోపణలు వచ్చాయి. వినియోగదారుల్ని మోసం చేశారంటూ సంస్థపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- రంగారెడ్డి పరిధిలోని జీఎస్టీ అధికార బృందం కేసు నమోదు చేసి సంబంధించిన వివరాలతో నివేదికను...రాష్ట్ర కమిటీకి పంపింది. జీఎస్టీ అధికారులు మాట్లాడుతూ... ఏఎంబీ సినిమాస్ జనవరి నెలలో నూతన జీఎస్టీ ధరలు అమలు చేయకుండా 35లక్షల లబ్ధి పొందిందని వెల్లడించారు. సూపర్‌స్టార్‌కి చెందిన బ్యాంక్ అకౌంట్లను అధికారులు తమ పరిధిలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సేవల పన్ను 18 లక్షలు బకాయి చెల్లించనట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
స్పందించిన ఏఎంబీ యాజమాన్యం... జీఎస్టీ అధికారుల నుండి తమకెలాంటి నోటీసులు రాలేదని తెలిపింది. ఏఎంబీ మల్టీఫ్లెక్స్ కారణంగా 170 సాధారణ ధర, 30 రూపాయల జీఎస్టీ కలుపుకొని 200 రూపాయలుగా తెలంగాణ హైకోర్టు సూచించిందని... ఇది ఫిబ్రవరి 22 నుండి అమలులోకి వస్తోందని వివరణ ఇచ్చింది.