వాలంటైన్స్ డే అంటే ప్రేమికులకే కాదు. సినిమా ప్రేక్షకులకూ పండగే. రేపు మూడు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇందులో తెలుగు సినిమా లేకపోవడం మన ప్రేక్షకులకు అసంతృప్తే. చిత్రం బాగుంటే ఆదరించడంలో ముందుటారు తెలుగు ప్రేక్షకులు.
లవర్స్ డే...
కన్ను గీటే సన్నివేశంతో దేశవ్యాప్తంగా పాపులరైన సినిమా ఇది. విడుదలకు ముందే చిత్రంలోని హిరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్ అందరికీ సుపరిచితమైంది. ఏడాది క్రితం టీజర్ రిలీజైంది. ఇప్పుడు సినిమా వస్తోంది. ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఇప్పటికే పాటలు, ప్రచార చిత్రం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి.
రోషన్ అబ్దుల్ కథానాయకుడుగా నటించాడు. ఒమర్ లులు దర్శకత్వం వహించాడు. పాటల విడుదల కార్యక్రమానికి అల్లు అర్జున్ అతిథిగా రావడం.. పాపులరైన గన్ పేల్చే సన్నివేశం అనుకరించడం సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
దేవ్...
కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్... హీరో,హిరోయిన్లుగా నటిస్తున్న చిత్రం దేవ్. రెండు వేరు వేరు ఆలోచనలున్న వ్యక్తుల లవ్లో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనేదే సినిమా కథ. వీరిద్దరూ కలిసి నటిస్తున్న రెండో సినిమా ఇది. ఇంతకు ముందు వచ్చిన ఖాకీలో ఇద్దరి కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టకుంది. ఈ సినిమా కూడా అందరికి కచ్చితంగా నచ్చుతుందని కార్తీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
రజత్ రవిశంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు హారీశ్ జైరాజ్ సంగీతమందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సినిమా గురించి తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
గల్లీ బాయ్..
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన సినిమా ఇది. స్ట్రీట్ రాపర్గా రణ్వీర్ సందడి చేయనున్నాడు. ముంబయి స్ట్రీట్ రాపర్స్ డివైన్, నేజి జీవిత కథే ఈ సినిమా. ఫ్రిబ్రవరి 9న ప్రఖ్యాత బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రం ప్రదర్శితమైంది. రేపు మీ ముందుకు రానుంది.
ఇతర పాత్రల్లో కల్కి కొచ్చిన్, సిద్దాంత్ చతుర్వేది నటించారు. ఇందులో మొత్తం 18 పాటలున్నాయి. వివిధ సంగీత దర్శకులు సంగీతమందించారు. రణ్వీరే ఏడు పాటలు పాడటం మరో విశేషం. జోయా అక్తర్, ఫరాన్ అక్తర్ నిర్మించిన ఈ సినిమాకి జోయా అక్తర్ దర్శకత్వం వహించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">