హీరోలకంటే తామేం తక్కువ కాదంటోంది పూజా హెగ్డే. నాయుకా ప్రాధాన్య చిత్రాలూ వంద కోట్లు సాధించాయంటోందీ ముద్దుగుమ్మ. రాజీ, వీరే ది వెడ్డింగ్ లాంటి చిత్రాలే అందుకు ఉదాహరణంది.
ఇంత చేస్తున్నా పారితోషకం విషయంలో మాత్రం హీరోల కంటే హీరోయిన్లకు తక్కువ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. మహిళా ప్రాధాన్య చిత్రాలకూ మంచి వసూళ్ల వస్తాయని, నిర్మాతలకు ఈ విషయం ఇప్పటికే అర్థమై ఉంటుందని తెలిపింది.
హీరోలతో సమానంగా హీరోయిన్లకు పారితోషికం అందించాలని కోరుతోంది పూజా. మహిళా నిర్మాతలు ఎక్కువమంది వచ్చినపుడే ఈ సమస్య పరిష్కారమవుతుందని స్పష్టం చేసింది.
- 2018 ఫుల్ బిజీ:
గతేడాది నాకు బాగా కలిసొచ్చింది. చిత్రాలతో ఫుల్ బిజీగా గడిపాను. కుటుంబసభ్యుల్ని కలవడానికీ తీరిక లేదు. ఈ సంవత్సరం కూడా ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నానంది.
- దేవుడే నా గాడ్ ఫాదర్:
గాడ్ ఫాదర్ లేకుండా జీవితంలో విజయం సాధించానని చెప్పడం కొంచెం కష్టం. మీకు ప్రతిభ ఉండి కొంచెం కష్టంతో అదృష్టం కలిసొస్తే మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. తనకు దేవుడే గాడ్‌ఫాదర్ అని చెబుతోంది పూజా.
- డ్రీమ్ రోల్స్:
మంచి చిత్రాలు చెయ్యాలి. సవాళ్లతో కూడిన పాత్రలు పోషించడమే నా చిరకాల స్వప్నం.
- ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు:
It’s a wrap for #Housefull4! Never expected working on my first multi-starrer to be such a blast! 🤗🤗@akshaykumar @Riteishd @kritisanon @kriti_official @thedeol @farhad_samji #SajidNadiadwala @foxstarhindi @NGEMovies @WardaNadiadwala pic.twitter.com/aDdRBExZ7Z
— Pooja Hegde (@hegdepooja) November 20, 2018 " class="align-text-top noRightClick twitterSection" data="
">It’s a wrap for #Housefull4! Never expected working on my first multi-starrer to be such a blast! 🤗🤗@akshaykumar @Riteishd @kritisanon @kriti_official @thedeol @farhad_samji #SajidNadiadwala @foxstarhindi @NGEMovies @WardaNadiadwala pic.twitter.com/aDdRBExZ7Z
— Pooja Hegde (@hegdepooja) November 20, 2018It’s a wrap for #Housefull4! Never expected working on my first multi-starrer to be such a blast! 🤗🤗@akshaykumar @Riteishd @kritisanon @kriti_official @thedeol @farhad_samji #SajidNadiadwala @foxstarhindi @NGEMovies @WardaNadiadwala pic.twitter.com/aDdRBExZ7Z
— Pooja Hegde (@hegdepooja) November 20, 2018
తెలుగులో మహేశ్ సరసన మహర్షి చిత్రంలో నటిస్తోంది. హిందీలో అక్షయ్‌కుమార్, రితేశ్దేశముఖ్తో కలిసి హౌస్‌ఫుల్-4 చేస్తోంది.
- మొహంజదారోతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిందీ భామ. ఆ సినిమాతో ఆశించిన ఫలితం రాక తెలుగు చిత్రాలపై దృష్టి సారించింది. తెలుగులో ముకుంద, ఒక లైలా కోసం, డీజే, రంగస్థలం, అరవింద సమేత లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది పూజాహెగ్డే.