ప్రశాంత్, అవంతిక హీరో హీరోయిన్లుగా, నందమూరి తారకరత్న ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం ప్రాణం ఖరీదు. ఎన్ ఎస్ క్రియేషన్స్ పతాకంపై పద్మప్రియ సమర్పణలో నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మించారు. పీఎల్కే రెడ్డి దర్శకుడు. ఈ చిత్రంలోని సాంగ్ టీజర్‌ను వందేమాతరం శ్రీనివాస్ విడుదల చేశారు. 'నా కన్నులు వెతికే వెతికే నీకోసం' అంటూ సాగే పాట ఆకట్టుకుంటోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని చిత్రబృందం తెలిపింది. త్వరలోనే సినిమా విడుదల చేస్తామని ప్రకటించింది. వందేమాతరం శ్రీనివాస్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు.