ETV Bharat / cinema

'ఎన్నారై'కి కొత్త అర్థం! - అక్కినేని అమల

అవసరాల శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా ప్రారంభమైంది. ‘ఎన్​ఆర్​ఐ- నాయనా..! రారా ఇంటికి’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తోంది.

‘ఎన్​ఆర్​ఐ- నాయనా..! రారా ఇంటికి’
author img

By

Published : Feb 21, 2019, 6:35 AM IST

Updated : Feb 21, 2019, 9:34 AM IST

అవసరాల శ్రీనివాస్​, మంచు లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'నాయనా రారా ఇంటికి'. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.

ఈ సినిమా ద్వారా బాల రాజశేఖరుని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రదీప్ కేఆర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవంలో అక్కినేని ఫ్యామిలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముహూర్తపు సన్నివేశానికి అక్కినేని అమల క్లాప్ నిచ్చారు. కార్యక్రమానికి అఖిల్, సుమంత్, సుశాంత్​, నాని హాజరయ్యారు.

‘ఎన్​ఆర్​ఐ- నాయనా..! రారా ఇంటికి’ యూనిట్​
nri movie
అక్కినేని అమల క్లాప్
  • ఈ చిత్రానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు యోగేశ్వర శర్మ సంగీతం సమకూరుస్తున్నాడు. చిత్రంలోని పాటలన్నింటికీ సిరివెన్నెల సాహిత్యం అందిస్తున్నారు. నాగబాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన అవసరాల శ్రీనివాస్.. ‘అష్టాచమ్మా’ సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో దర్శకుడి అవతారమెత్తి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఓ వైపు నటుడిగా సినిమాలు చేస్తూనే దర్శకత్వమూ వహిస్తున్నారు. కిందటేడాది ‘ఆ!’, ‘మహానటి’, ‘దేవదాస్’, ‘సమ్మోహనం’, ‘అంతరిక్షం’ చిత్రాల్లో అవసరాల నటించారు.

nri movie
అవసరాల శ్రీనివాస్, మంచు లక్ష్మి
  • కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మాత్రమే కాకుండా హీరోగానూ అవసరాల తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆయన హీరోగా 2017లో ‘బాబు బాగా బిజీ’ అనే అడల్ట్ కామెడీ సినిమా వచ్చింది. టీజర్, ట్రైలర్లతో ఈ సినిమా హల్​చల్​ చేసినా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.

Intro:Body:Conclusion:
Last Updated : Feb 21, 2019, 9:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.