నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'జెర్సీ' చిత్రంలో నటిస్తున్న నాని... విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమం నేడు జరిగింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పీసీ శ్రీరాం సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.పూజా కార్యక్రమంలో చిత్రబృందం వరుస ఫ్లాపులతో ఉన్న నాని 'జెర్సీ' మీదే ఆశలు పెట్టుకున్నాడు. విక్రమ్ తెలుగులో దర్శకత్వం వహించిన 'హలో' చిత్రానికి సరైన ఆదరణ లభించలేదు. ఇద్దరికీ ఈ సినిమా విజయం సాధించడం చాలా ముఖ్యం.