ETV Bharat / cinema

'భారతీయతకు' ఆస్కార్

91వ ఆస్కార్​ అవార్డుల ప్రదానోత్సవంలో భారత ఖ్యాతి వెల్లివిరిసింది. భారత మహిళల స్థితిగతులపై తీసిన లఘు చిత్రం 'పీరియడ్​: ఎండ్ ఆఫ్​ సెంటెన్స్' ఆస్కార్ పురస్కారం గెలుచుకుంది.

author img

By

Published : Feb 25, 2019, 9:13 AM IST

Updated : Feb 25, 2019, 6:16 PM IST

'భారతీయతకు' ఆస్కార్

భారతీయ చిత్రాలకు ఆస్కార్ అవార్డులు ఇంతవరకు రాలేదు. కొన్నిసార్లు నామినేట్ అయినా విజేతగా ఎప్పుడు నిలవలేదు. గతేడాది భారత మహిళల స్థితిగతులపై రూపొందించిన ఓ హిందీ లఘు చిత్రానికి నేడు ఆస్కార్ దక్కింది. 'పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్​' అనే షార్ట్​ ఫిల్మ్​ ఉత్తమ డాక్యుమెంటరీ లఘు చిత్ర విభాగంలో అవార్డుని గెల్చుకుంది.

రుతుక్రమం సమయంలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను ఈ చిత్రంలో ప్రధానంగా చూపించారు. సానిటరీ ప్యాడ్స్ వినియోగం లాంటి అంశాలపై మహిళల్లో అవగాహన తెచ్చే ప్రయత్నం చేశారు. రేకా బేహ్తాబ్చీ దర్శకత్వం వహించారు. భారత నిర్మాత గునీత్ మోంగా సినిమాను నిర్మించారు.

అవార్డ్​ అందుకొన్న చిత్ర నిర్మాతలు

"మహిళల రుతుక్రమంపై తీసిన ఈ చిత్రం ఆస్కార్​ గెలిచిందంటే నమ్మలేకపోతున్నాను"

- మెలిసా బెల్టన్, చిత్ర నిర్మాత

undefined

"ఈ లఘు చిత్రాన్ని ప్రపంచంలో ఉన్న ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అంకితమిస్తున్నాను. పీరియడ్స్ అమ్మాయిల చదువులకు ఆటంకం కాకూడదు"

-- గునీత్ మోంగా, చిత్ర నిర్మాత

2018 ఫిబ్రవరిలో 'క్లీవ్ లాండ్ ఫిల్మ్ ఫెస్టివల్'​లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. నెట్​ఫ్లిక్స్ ఈ లఘుచిత్రాన్ని పంపిణీ చేస్తోంది.

Prayagraj (UP), Feb 24 (ANI): Prime Minister Narendra Modi took holy dip at Triveni Sangam in Uttar Pradesh's Prayagraj on Sunday. PM Modi arrived in Prayagraj today. He was accompanied by Chief Minister Yogi Adityanath.
Last Updated : Feb 25, 2019, 6:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.