150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ రికార్డు సృష్టించిన దర్శకుడు కోడి రామకృష్ణ. ఆయనను ఎప్పుడు చూసినా నుదుటికి తలగుడ్డ కట్టుకుని కనిపించేవారు. ఆయనకు ఈ తలగుడ్డ, చేతిదారాలు సెంటిమెంటని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.
నేపథ్యం
మా పల్లె గోపాలుడు సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఆయన కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్న మోకా రామారావు అనే వ్యక్తి ఇలా అన్నాడు... "మీ నుదిటి భాగం చాలా పెద్దగా ఉంది... ఎండలో అది మాడిపోతుంది" అని చెప్పి తన జేబురుమాలును రామకృష్ణ నుదుటికి చుట్టారట. అది ఆయనకు చాలా నచ్చింది.
అదే మోకా రామారావు... కోడి రామకృష్ణ నుదుటి కొలతల ప్రకారం ఒక బ్యాండ్ చేయించి ఇచ్చారు. ఈ అవతారంలో కోడి రామకృష్ణను చూసిన దర్శకుడు బాలచందర్.. ఈ గెటప్ ఈ జన్మది కాదు క్రితం జన్మ తాలూకుది అన్నారట. సన్నిహితులు కూడా తలగుడ్డ బాగా నప్పిందని అనడంతో దాన్ని అలానే కొనసాగించారు కోడి.