150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు కోడి రామకృష్ణ అందరు హీరోలతో అన్ని రకాల జోనర్లలో సినిమాలు తీసి ఆకట్టుకున్నారు. భక్తి, హర్రర్, క్రైమ్, థ్రిల్లర్, కామెడీ చిత్రాలతో అలరించారు. ఆయన సినిమాల్లో గ్రాఫిక్స్‌కు పెద్దపీట వేశారు.
తెలుగులో గ్రాఫిక్స్‌కు కోడి రామకృష్ణ ఆద్యుడిగా చెప్పొచ్చు. అమ్మోరు సినిమాతో తన సత్తా ఏంటో చూపించారు. గ్రాఫిక్స్‌తో విజువల్ వండర్ సృష్టించారు. ఆ తర్వాత 'దేవి' 'దేవీ పుత్రుడు', 'అంజి', 'అరుంధతి', 'నాగభరణం' చిత్రాలతో అలరించారు.
బొమ్మాలి నిన్నొదల అంటూ తెరకెక్కించిన అరుంధతి సినిమా ఘనవిజయం సాధించింది. అందుకు ప్రధాన కారణం సాంకేతికంగా ఉన్నతంగా తీర్చిదిద్దడం. అంజి, దేవీపుత్రుడు చిత్రాల్లోనూ అబ్బురపరిచే గ్రాఫిక్స్‌తో ఆకట్టుకున్నారు.
చివరగా ఆయన తెరకెక్కించిన చిత్రం నాగభరణం. కన్నడ నటుడు విష్ణువర్ధన్ 1972లో తీసిన నాగరాహువు సినిమా రీమేక్ చేశారు. చనిపోయిన విష్ణువర్ధన్‌ను గ్రాఫిక్స్‌తో మళ్లీ తెరపై చూపించడం ఆయనకే చెల్లింది. ఇదే చిత్రంలో 120 అడుగుల పామును సృష్టించి ఔరా అనిపించారు కోడి.
ఇవీ చూడండి..కోడి హెడ్‌బ్యాండ్ కథేంటి.!