పాక్ ప్రభుత్వం గురువారం భారత్కు వ్యతిరేకంగా మరో నిర్ణయం తీసుకుంది. భారతీయ చిత్రాలు ఆ దేశంలో విడుదల కాకుండా ఆంక్షలు విధించింది. భారతీయ చిత్రాలను బహిష్కరించాలని పాకిస్థాన్ సినిమా పంపిణీదారుల సంఘాలకు ఆదేశాలిచ్చింది ఆ దేశం. భారత్లో చిత్రీకరించిన ప్రకటనలనూ పాక్లో ప్రసారం కాకుండా చూడాలని పీఈఎమ్ఆర్ఏ(పాకిస్థాన్ ఎలక్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ)కి సూచనలు చేసింది. ఈ విషయాన్ని పాక్ సమాచార, ప్రసార శాఖ మంత్రి ఫవడ్ హుస్సేన్ మీడియాకు వెల్లడించాడు.
- మనంముందే...
పుల్వామాలో సీఆర్పీఎఫ్ ఉగ్రదాడిని నిరసిస్తూ భారత చలన చిత్ర రంగం పాక్ నటీనటులపై నిషేధం విధించింది. ఆ దేశానికి సంబంధించిన నటులను భారత్లో అడుగుపెట్టనివ్వకూడదని ప్రముఖులుముక్త కంఠంతోపిలుపునిచ్చారు.
- అనంతరం టోటల్ ధమాల్, లూకా చుప్పి, అర్జున్ పటియాలా, నోట్బుక్, కబీర్ సింగ్ సినిమాల నిర్మాతలు...పాక్లో చిత్రాలను విడుదల చేయబోమని ప్రకటించారు. పాక్లో విడుదల చేయకపోతే నష్టమేమీ లేదంటూ భారత సినీ రంగం అభిప్రాయం వ్యక్తం చేసింది.
- కారణమేంటి..?
పుల్వామా ఉగ్రదాడికి 12 రోజుల్లో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత వైమానిక దళం బాంబులకు జైషే మహ్మద్ శిక్షణా శిబిరంలోని ఉగ్రవాదులు, సీనియర్ కమాండర్లు 350 మందికి పైగా హతమైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.