ETV Bharat / middle-east

సౌదీతో కీలక ఒప్పందాలు - modi

భారత పర్యటనకు వచ్చిన సౌదీ యువరాజు మహమ్మద్​ బిన్​ సల్మాన్​ - ప్రధాని మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. భారత్​లో 100 బిలియన్​ డాలర్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించారు సల్మాన్​.

యువరాజు మహ్మద్​ బిన్​ సల్మాన్​ - ప్రధాని మోదీ
author img

By

Published : Feb 21, 2019, 6:30 AM IST

Updated : Feb 21, 2019, 7:59 AM IST

సౌదీ యువరాజు మహ్మద్​ బిన్​ సల్మాన్ భారత పర్యటనలో భాగంగా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలతో పాటు కీలక ఒప్పందాలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యారు.

మేము పెట్టుబడులు పెడతాం

ఉన్నత సహకార మండలి​ ఏర్పాటు

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతం చేసుకునేందుకు సౌదీ ఆరేబియా ఉన్నత సహకార మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సౌదీ యువరాజు మహ్మద్​ బిన్​ సల్మాన్, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తారు.

వాణిజ్యం, రాజకీయ, రక్షణ సంబంధ విషయాలపై మాత్రమే కాకుండా ఇతర అంశాల్లో ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని ఈ మండలి​లో చర్చించుకునే అవకాశముంది.

పెట్టుబడులు మొదట భారత్​లోనే:

తాము పెట్టుబడులు పెట్టడానికి మొదట ఎంచుకునే దేశం భారతేనని సౌదీ స్పష్టం చేసింది. ఇప్పటికే భారత్​లో చమురు శుద్ధి, పెట్రో కెమికల్స్​, ఎరువుల సంస్థలున్నాయని పేర్కొంది.

తమ దేశంలో సంస్కరణలు ప్రవేశ పెట్టాలనుకుంటున్నామని తెలిపారు సౌదీ పెట్రోలియం మంత్రి ఖలీద్​. ప్రపంచ దేశాల వృద్ధిలోనూ భాగస్వాములు కావాలని అశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

భారత్​ మరో 2-3 దశాబ్దాలలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. భారత్​ మాకు వ్యూహాత్మక వ్యాపార భాగస్వామి. శక్తి వనరులు భారత్​కు- సౌదీకి అనుసంధాన కర్త . మేము వ్యాపారవేత్తలం కాదు, పెట్టుబడిదారులం.

- ఖలీద్,​ పెట్రోలియం శాఖమంత్రి

ఇరు దేశాల సంస్థల మధ్య 15 ఒప్పందాలు

టీసీఎస్​, కార్నివాల్​ సినిమాస్​, జెలెన్​ మార్క్​ సహా 15 ప్రముఖ సంస్థలు సౌదీలు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి.

ఏడబ్ల్యూజే ఎనర్జీ,సెక్యూర్​ ఐ, కార్నివాల్​ సినిమా, రెడ్​ సీ ఆరేబియా సంస్థలకు అనుమతులు​ జారీ చేసింది దుబాయ్​ ప్రభుత్వం.

undefined

భారత్​లో 100 బిలియన్​ డాలర్ల పెట్టుబడులు

భారత్​లో 100 బిలియన్​ డాలర్లు పెట్టుబడులు పెడతామని సౌదీ యువరాజు మహ్మద్​ బిన్​ సల్మాన్​ ప్రకటించారు. 2016 నుంచి ఇప్పటి వరకు 44 బిలియన్​ డాలర్లు పెట్టుబడులు పెట్టినట్లు స్పష్టం చేశారు. ఐటీ రంగంలో భారత దేశం రోజురోజుకూ వృద్ధి కనబరుస్తోందని, సౌదీ కూడా ఈ విషయం సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు .

హజ్​ యాత్రికుల కోటా పెంపు:

హజ్​ యాత్రికుల కోటాను మరో 25 వేలు పెంచింది సౌదీ ప్రభుత్వం. మూడు సంవత్సరాల్లో ఇది మూడో పెంపు. దీంతో ఏటా హాజ్​ యాత్రకు వెళ్లే వారి సంఖ్య 2 లక్షలకు చేరింది.

New Delhi, Feb 21 (ANI): Prime Minister Narendra Modi on Wednesday departed from New Delhi for his two-day visit to South Korea. PM Modi will held discussions with South Korean President Moon Jae-in to boost bilateral relations. PM Modi will also be conferred the Seoul Peace Prize, the honour which was announced in October last year.
Last Updated : Feb 21, 2019, 7:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.