ETV Bharat / middle-east

కాఫీ ప్రేమికుల స్వర్గధామం

కాఫీ ఎగుమతులకు ప్రధాన కేంద్రమైన వియత్నాంలో కాఫీ మ్యూజియం అందరిని ఆకట్టుకుంటోంది.

కాఫీ మ్యూజియం
author img

By

Published : Feb 14, 2019, 12:21 PM IST

కాఫీ మ్యూజియం
పొద్దున్నే కాఫీ తాగకపోతే ఏ పనీ చేయలేని వారు మనలో చాలామందే ఉంటారు. అలాంటి వారి కోసమే వియత్నాంలో ఏర్పాటైంది ఈ కాఫీ మ్యూజియం. కాఫీ ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా ఉన్న వియత్నాం వివిధ కళాకృతులతో పాటు కాఫీ తయారీ యంత్రాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచింది.
undefined

ఈ కాఫీ ప్రదర్శనశాల ఎంతో ఆసక్తికరమైనది. విలువైనది. ప్రపంచ కాఫీ ఎగుమతుల్లో ముందు వరుసలో ఉన్న వియత్నాంలో ఇప్పటివరకు కాఫీ మ్యూజియం లేదు. స్థానికులకే కాదు, ప్రపంచానికి వియత్నాం కాఫీని పరిచయం చేసేందుకు ఇది సరైన మార్గం.
- హో క్వాంగ్​, మ్యూజియం సందర్శకుడు.

ఈ కాఫీ ప్రదర్శనశాల బాన్​ మీ థూట్​ అనే నగరంలో ఉంది. స్థానికంగా అల్పసంఖ్యాక వర్గమైన రేడ్​ జాతి ఇళ్ల ఆకృతిని ఈ భవన నిర్మాణానికి ప్రేరణగా తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా కాఫీ తోటల్లో వీరు కార్మికులుగా పనిచేస్తున్న కారణంగా ఈ శైలి నిర్మాణాన్ని ఆ జాతికి అంకితం చేశారు. వియత్నాంలోని దిగ్గజ కాఫీ తయారుదారైన లెజెండ్​ సంస్థ ఈ మ్యూజియంను ఏర్పాటు చేసింది.

స్థానిక రైతుల దగ్గర నుంచి విదేశీయుల వరకు ఈ మ్యూజియంను ఎవరైనా సందర్శించొచ్చు. కాఫీ తయారీని తెలుసుకోవడమే కాక వారి అనుభవాల్ని పంచుకోవచ్చు. ప్రతివారం ఇందులో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. స్థానిక వ్యవసాయదారుల మార్కెట్​ను పరిచయం చేస్తుంటాం. తద్వారా కాఫీ పరిశ్రమలో జరిగే విషయాల్ని తెలియజేస్తాం.
- జియాంగ్​, డిప్యూటీ డైరెక్టర్​, లెజెండ్​ కాఫీ గ్రూప్​

మొక్క దశ నుంచి మన టేబుల్​పైకి కాఫీ కప్పు వచ్చే వరకు పూర్తి తయారీ విధానాన్ని సందర్శకుల కళ్ల ముందుంచుతుంది ఈ మ్యూజియం. వివిధ దేశాలకు చెందిన సుమారు 10వేల వస్తువులు ఈ ప్రదర్శనశాలలో కనువిందు చేస్తాయి. హాంబర్గ్​లోని జర్మన్ జెన్స్​బర్గ్ కాఫీ మ్యూజియంలో వాడిన యంత్రాలు, టర్కీ నుంచి తెచ్చిన ప్రత్యేక కుండలు, కప్పులు వీటిలో ప్రధానంగా ఉన్నాయి. కాఫీ సాగుకు స్థానిక ప్రజలు వినియోగించే ఉపకరణాలనూ అందుబాటులో ఉంచారు.

undefined

ఈ ప్రదర్శనశాకు విచ్చేసే సందర్శకులు వివిధ కాఫీ రుచులను ఆస్వాదించే అవకాశం ఉంది. సమాచారంతో పాటు వివిధ కాఫీ సంస్కృతులను తెలుసుకోవచ్చు. సాధారణంగా కనిపించే కాఫీ వెనుక లోతైన విషయాలు అవగాహనకు వస్తాయి.
- జియాంగ్​, డెప్యూటీ డైరెక్టర్​, లెజెండ్​ కాఫీ గ్రూప్​

కాఫీ సంస్కృతుల గురించి నాకు పెద్దగా తెలియదు. స్థానికంగా దొరికే కాఫీని మాత్రమే తాగుతాను. పలు రకాల కాఫీ పద్ధతుల్ని తెలుసుకునేందుకే ఈ మ్యూజియంకి వచ్చాను.
- ట్రంగ్ కైన్, మ్యూజియం సందర్శకుడు.

ప్రదర్శనశాల మొత్తం చుట్టి వచ్చిన తరువాత కాస్త సేద తీరేందుకు ఇక్కడి కాఫీ రుచులు మనల్ని ఆహ్వానిస్తాయి.

Patna (Bihar), Jan 14 (ANI): Lok Janshakti Party (LJP) leader Chirag Paswan, while calling both Mayawati and Akhilesh Yadav corrupt, admitted that the political tie-up of Samajwadi Party (SP) and Bahujan Samaj Party (BSP) is a strong one. Chirag recalled the results of Gorakhpur and Kairana bypolls, and said the National Democratic Alliance (NDA) needs to learn from the loss.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.