
అద్భుత విన్యాసాలతో కళాకారులు ఆకట్టుకున్నారు. విద్యుత్కాంతుల వెలుగులో చేసిన ప్రదర్శనలు చూపరుల్ని కట్టిపడేశాయి. నది మధ్యలో నృత్య ప్రదర్శనలు, నిప్పులతో ఆటలు వీక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి.
చిన్న చిన్న పడవల్లో పోటీలు, చంద్రుని ఇతివృత్తంతో రూపొందిచిన బెలూన్లు ప్రత్యేకంగా నిలిచాయి. ఈ ఏడాది 'వెనిస్ కార్నివాల్' ఫిబ్రవరి 16 నుంచి మార్చి 5 వరకు నిర్వహించనున్నారు.