2018 నవంబర్ 17న ఇంధన పన్నులకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఈ నిరసనలు, అధ్యక్షుడు మేక్రాన్ వ్యాపార విధానాలను వ్యతిరేకిస్తూ సామూహిక ఉద్యమంగా రూపాంతరం చెందింది.
ఈ ఆందోళనకు మరోవైపు యూదు వ్యతిరేకత తోడై ఫ్రాన్స్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. కొంతకాలం క్రితం యెల్లో వెస్ట్ ఆందోళనకారులను సమర్థించిన తత్వవేత్త అలెన్, అనంతరం ఉద్యమ కారుల్లో జాత్యంహకారం, యూదు వ్యతిరేక భావాలున్నాయని ఆరోపించారు. ప్రస్తతం అలెన్‌పై నిరసనకారులు నిప్పులు చెరుగుతున్నారు.
పారిస్ నగరంతో పాటు మిగతా నగరాల్లోనూ పచ్చకోటు నిరసనలు కొనసాగుతున్నాయి. నార్మండీ ఆందోళనలో చెలరేగిన తోపులాటలో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ నిరసనలపై అధ్యక్షుడు మేక్రాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
"యూదు వ్యతిరేక ఆరోపణలు గొప్ప దేశమైన ఫ్రాన్స్ ఆదర్శాలకు విరుద్ధం" అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ ట్వీట్ చేశారు.
Les injures antisémites dont il a fait l’objet sont la négation absolue de ce que nous sommes et de ce qui fait de nous une grande nation. Nous ne les tolèrerons pas.https://t.co/WSUTuJmQWX
— Emmanuel Macron (@EmmanuelMacron) February 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Les injures antisémites dont il a fait l’objet sont la négation absolue de ce que nous sommes et de ce qui fait de nous une grande nation. Nous ne les tolèrerons pas.https://t.co/WSUTuJmQWX
— Emmanuel Macron (@EmmanuelMacron) February 16, 2019Les injures antisémites dont il a fait l’objet sont la négation absolue de ce que nous sommes et de ce qui fait de nous une grande nation. Nous ne les tolèrerons pas.https://t.co/WSUTuJmQWX
— Emmanuel Macron (@EmmanuelMacron) February 16, 2019
అయితే ప్రస్తుతానికి ఉద్యమం బలహీన పడుతున్నా, నిరసనకారులకు ప్రజల మద్దతు లభిస్తుండడం, వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.