ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు మరింత సమయం కావాలని బ్రిటన్ ప్రధాని థెరెసా మే ప్రకటించారు. మార్చి 29న ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగనున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈయూతో చర్చలు కీలక దశలో ఉన్నాయని, ఓ అర్థవంతమైన ఒప్పందానికి మార్గం సుగమం అయ్యేందుకు బ్రెగ్జిట్ ఆమోదం పొందాలని అభిప్రాయపడ్డారు.
అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా బ్రెగ్జిట్ ఒప్పందంలో మార్పులు చేశామని తెలిపారు థెరిసా. తదుపరి ఓటింగ్లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వివాదాస్పదమైన ఐరిష్ సరిహద్దు అంశంపైనా దృష్టి సారించినట్లు వెల్లడించారు.
బ్రెగ్జిట్ అంశంపై ప్రతిపక్షాల ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. బ్రెగ్జిట్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో... థెరిసా మే నిర్లక్ష్య పూరిత వైఖరి అవలంభిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.