పాక్ నిర్బంధించిన కుల్‌భూషణ్ జాదవ్ కేసు అంతర్జాతీయ న్యాయస్థానంలో సోమవారం విచారణకు వచ్చింది. భారత్ తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది హరీశ్ సాల్వే... వియన్నా కన్వెన్షన్ తీర్మానాలను పాక్ ఉల్లంఘించిందని ఆరోపించారు.
పాక్‌పై హరీశ్ ఆరోపణాస్త్రాలు
దౌత్య పరమైన సంబంధం లేకుండా జాదవ్‌ను నిరవధికంగా నిర్బంధించారని కోర్టుకు సాల్వే తెలిపారు. ఇప్పటికే 13 సార్లు జాదవ్‌తో మాట్లాడేందుకు అనుమతించాలని భారత్ కోరగా పాక్ నుంచి సమాధానమే లేదని న్యాయమూర్తికి వివరించారు సాల్వే. జాదవ్ ఉగ్రవాది అనడానికి పాక్ వద్ద సరైన ఆధారాలు లేకున్నా విడుదల చేయడానికి ఆ దేశం నిరాకరిస్తోందని వాదించారాయన.