ETV Bharat / europe

ఆకాశంలో కాంతి...వింతైన అనుభూతి

ఉత్తర ఐస్​ల్యాండ్​లో శీతాకాలంలో సహజంగా ఏర్పడే 'నార్తర్న్​ లైట్స్' అందాలను చూడటానికి పర్యాటకులు తహతహలాడుతున్నారు.

author img

By

Published : Feb 14, 2019, 1:11 PM IST

నార్తర్న్ లైట్స్​
నార్తర్న్ లైట్స్​
శీతాకాల రాత్రి...చుట్టూ నిశ్శబ్దం...ఆకాశంలో అనూహ్యమైన కాంతి...జీవితంలో ఒక్కసారైనా ఆ దృశ్యం చూడాలి...ఆకాశంలో సహజ సిద్ధంగా ఏర్పడే ఆ ప్రాకృతిక అందం... ఉత్తర ఐస్​ల్యాండ్ ​ప్రాంతలోనిది. ప్రపంచంలో ఎక్కడా లేని ఒక ప్రత్యేకత ఇక్కడుంది. శీతాకాలం మాత్రమే కనిపించే ఆ వింత దృశ్యం చూడటానికి పర్యటకులు తహతహలాడతారు.
undefined

ఆకాశం రంగులమయంగా మారుతుంది. ఆ దృశ్యాన్ని 'నార్తర్న్ లైట్స్​గా' పిలుస్తారు. ఇది ఏర్పడటానికి కారణం అయస్కాంత సౌర గాలి, భూమి గురుత్వాకర్షణ శక్తితో కలసి వాతావరణంలో అణువులు మెరిసేలా చేయడమే.

ఇది ఏర్పడే సమయంలో ఆకాశంలో పచ్చ, నీలం, పసుపు రంగుల కలయికలో ఒక కాంతి ప్రకాశిస్తుంది. పర్యటకులు శీత కాలంలో పెద్ద సంఖ్యలో ఈ వింతను చూడటానికి వస్తారు. అయితే ఎంత ప్రయత్నించినా ఒక్కోసారి ఇవి కనిపించే అవకాశం ఉండదు. అందుకే ఇక్కడివారు ఆ కాంతి చూడాలంటే కష్టం, అదృష్టం రెండూ ఉండాలంటారు.

ఈ ప్రదేశానికి చేరుకోవడం అంత సులువు కాదు. అలవాటైన వాహన చోదకులే ప్రమాదాలకు గురవుతుంటారు. మంచు విపరీతంగా కురవడం వల్ల కారు టైర్లు జారుతుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ వింతను చూసినవారు పెద్ద సాహసం చేసినట్లే.

ఐస్​ల్యాండ్​లో ఒక నానుడి ఉంది. 'ఇక్కడి వాతావరణం ఐదు నిముషాలకు ఒకలా మారుతుంది.' విదేశీయులకు ఈ మార్పు అసాధారణంగా అనిపిస్తుంది. వాతావరణం, రహదారుల పరిస్థితి అలానే ఉంటుంది. పొడిగా ఉన్న రోడ్డు నిముషాల్లో వెనువెంటనే మంచు వల్ల జారుతుంది.
-జాహ్నస్ సిగ్​ఫ్యుసన్, పోలీసు అధికారి

వాహనాలు నడిపేవారు ఆకాశం వైపు తీక్షణంగా చూస్తూ రోడ్డుపై నిర్లక్ష్యం వహించడం ప్రమాదాలకు ఒక కారణంగా అధికారులు చెబుతున్నారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ పర్యటకులు ఈ కాంతిని చూడటానికి ఉవ్విళ్ళూరుతూనే ఉంటారు.

అడ్డంకులు దాటుకొని చివరికి ఈ ప్రదేశానికి చేరినా వింత దృశ్యం కనిపించక నిరాశగా వెనుదిరిగిన వారు కొంతమందైతే... ఈ వింతైన అనుభూతిని మనసారా ఆస్వాదించిన వారు మరికొందురు. మొత్తానికి ఉత్తర ఐస్​ల్యాండ్​లోని ఈ ప్రదేశానికి జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలనుకునే వారు ఇంకొందరు.

New Delhi, Jan 17 (ANI): Bharatiya Janata Party (BJP) president Amit Shah has been diagnosed with swine flu and is being treated under the supervision of All India Institute of Medical Sciences (AIIMS) Director Dr Randeep Guleria. Shah also took to Twitter to inform the countrymen about his ailment on Wednesday and wrote: "I have been affected by swine flu disease and the treatment for the same is going on. With the blessings of God and love and good wishes of all of you, I shall be healthy soon." Meanwhile, Union Health and Family Welfare Minister JP Nadda is soon expected to visit Amit Shah to take stock of his health.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.