వాట్సాప్ గ్రూప్‌లో సభ్యుడిగా చేరాలన్నా.. చేర్చాలన్నా అనుమతి తీసుకోనక్కర్లేదు ఇప్పటివరకు. ఇకపై అలా వీలుపడదు. కచ్చితంగా మీ అనుమతి ఉండాల్సిందే. త్వరలో ప్రవేశపెట్టే ఫీచర్‌తో ఈ సదుపాయం రానుంది.
ప్రస్తుతం ఇది ఇంకా పరీక్ష దశలోనే ఉంది. బీటా వెర్షన్‌ను ఐఫోన్లలో పరిశీలిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఆండ్రాయిడ్, విండోస్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్ అంటే..?
వినియోగదారుడు ఈ ఫీచర్ యాక్టివ్ చేసేందుకు సెట్టింగ్స్‌లోని అకౌంట్ సెక్షన్లో ప్రైవసీలో గ్రూప్స్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి.
ఎలా పనిచేస్తుంది?
గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్లో మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఎవ్రీవన్, మై కాంటాక్స్, నోబడి...
ఎవ్రీవన్ ఆప్షన్ ఆన్ చేసుకుంటే ఎవరైనా మిమ్మల్ని గ్రూప్‌లో సభ్యునిగా చేర్చుకోవచ్చు. దానికి మీ అనుమతితో పనిలేదు.
మై కాంటాక్ట్స్ ఆప్షన్ ఎంపిక చేసుకుంటే మీ వాట్సాప్‌లో ఉన్న స్నేహితులకు మాత్రమే అనుమతి ఉంటుంది. వేరెవరైనా మిమ్మల్ని గ్రూప్‌లో చేర్చాలంటే ఇన్విటేషన్ లింక్‌ను మీకు పంపిస్తారు. దాన్ని అంగీకరించడం, తిరస్కరించడం మీ ఇష్టం.
నోబడి ఆప్షన్ ఎంచుకుంటే కచ్చితంగా మీ అనుమతి ఉండాల్సిందే. ముందుగా మీకు ఓ గ్రూప్ ఇన్విటేషన్ లింక్ వస్తుంది. అంగీకరిస్తేనే గ్రూప్‌లో సభ్యుడు అవుతారు.
లింక్ పంపిన 72 గంటల్లో మీరు స్పందించాలి. ఆ తర్వాత అది చెల్లుబాటు కాదు. మరెప్పుడైనా మీరు గ్రూప్‌లో చేరాలంటే అడ్మిన్ అనుమతి ఉండాలి.