థాయ్‌లాండ్ బ్యాంకాక్ విమానాశ్రయంలో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. భారత్‌తో ఘర్షణల దృష్ట్యా పాకిస్థాన్ గగనతలాన్ని గురువారం అర్ధరాత్రి వరకు మూసివేయడమే ఇందుకు కారణం.
పాక్ గగనతలం మూసివేతతో ఆసియా-ఐరోపా మధ్య విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇరాన్ మీదగా ఐరోపా వెళ్లేందుకు చర్చలు జరిపినా... సఫలం కాలేదు. ఫలితంగా థాయ్‌లాండ్ నుంచి ఐరోపా వెళ్లే 30 విమానాలు బ్యాంకాక్‌లో నిలిచిపోయాయి. దాదాపు 5 వేల మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో పడిగాపులు పడుతున్నారు.
చైనా సహకారం
థాయ్ ఎయిర్వేస్ విమానాలు ఐరోపా వెళ్లేందుకు సహకరిస్తామని చైనా ప్రకటించింది. చైనా సహకారంతో గురువారం రాత్రి నుంచి యథాతథంగా విమాన రాకపోకలుంటాయని అధికారులు ప్రకటించారు.