జపాన్‌లో ప్రతియేటా నిర్వహించే వినోదాత్మక వేడుకలు వీడియో గేమ్ ప్రేమికులకు ఓ పండగలా మారాయి. జపాన్ దిగ్గజ సంస్థలు సెగ, కొనామీ, నామ్కో ఈ ఉత్సవాల్లో పాల్గొని కొత్తగా విపణిలోకి ప్రవేశ పెట్టే అర్కేడ్ యంత్రాలను ప్రదర్శిస్తున్నాయి.
ప్రస్తుతం అత్యంత ప్రాచుర్యం పొందుతోన్న వర్చువల్ రియాలీటీ యంత్రాలతో వీడియో గేమ్ ఔత్సాహికులకు ప్రత్యేక అనుభూతిని కలగజేస్తోంది బండీ నామ్కో సంస్ధ.
జపాన్‌లో ప్రజాదరణ పొందిన సినిమాలు, టీవీ షోలను వర్చువల్ రియాల్టీతో ఆభిమానుల ముందుకు తీసుకొస్తున్నాయి.
హెలికాఫ్టర్‌ను నడపటం, జాయ్ స్టిక్‌ను తుపాకీలా వాడటం, సింహంతో కలిసి పరిగెత్తడం వంటి ఆటలు సందర్శకులను అలరింపజేస్తున్నాయి.
నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి ఆటలో పాల్గొనలేదు. సింహంతో పాటు పరిగెత్తేందుకు నా శక్తినంతా ఉపయోగించా. చాలా కొత్త అనుభూతిని పొందా
-టొకుయ్ ర్యోసుకే, వీడియో గేమ్ ఔత్సాహికుడు
ఇంకా మరిన్ని వర్చువల్ రియాలిటీ గేమ్స్‌ను రూపొందించి ఔత్సాహికులను ఆకట్టుకునేందుకు వీడియోగేమ్ సంస్థలు సిద్ధమవుతున్నాయి.