ఒకప్పుడు పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, ఏనుగులు జింకలతో అలరారేది మాండుల్కిరి. దశాబ్దకాలంగా యథేచ్చగా జరుగుతున్న వేట, అడవుల విధ్వంసంతో వన్య మృగాల సంఖ్య గణనీయంగా పడిపోయింది.
పేదరికం, వన్యప్రాణి సంరక్షణ చట్టాల అమలు సరిగా లేకపోవడం వల్ల అక్కడి ప్రజలు జంతువుల్ని చంపి తినేవాళ్లు.
"ఇక్కడి స్థానికులు వ్యవసాయం చేసేందుకు అవసరమైన భూమి కోసం చెట్లు నరికేస్తున్నారు. ఇటీవల పెద్దసంఖ్యలో వృక్షాల్ని నేలమట్టం చేశారు. దీనివల్ల అడవులు తగ్గిపోయి జంతువులు ఆవాసాలు కోల్పోయాయి. "
-సో కున్, మయూరా వైల్డ్‌లైఫ్ ఫౌండేషన్ బోర్డ్ సభ్యుడు
అడవుల నరికివేతతో ముప్పు ముంగిట నిలిచిన జంతువులకు ఆశ్రయం కల్పిస్తోంది మయూరా జూపార్క్. దేశవిదేశాల పర్యటకులను ఆకర్షిస్తోంది.
"మయూరా పార్క్‌లో జింకలు, దుప్పులు, అడవి పందులున్నాయి. వన్యప్రాణులతో ప్రజలకు సాన్నిహిత్యం పెరుగుతుంది. వాటిని చూస్తే ఎంతో ఉత్సాహం కలుగుతుంది" -పనోమ్ పెన్, పర్యటకుడు