పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు నాలుగు మార్గాల గుండా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించే వారని గుర్తించినట్టు తెలిపారు అధికారులు. ఆ వివరాలను వెల్లడించారు.
బాలాకోట్ నుంచి కేల్ మీదుగా కుప్వారా జిల్లాలోని దుధ్నియాల్లోకి, బాలాకోట్ నుంచి కేల్ మీదుగా కుప్వారాలోని కైంతవాలీలోకి, బాలాకోట్ నుంచి కేల్ మీదుగా కుప్వారాలోని లోలబ్లోకి, బాలాకోట్ నుంచి కేల్ మీదుగా కుప్వాపాలోని కంచమ, క్రాల్పొరాలోకి ముష్కరులు అక్రమంగా చొరబడే వారని తెలిపారు.
మూడు నెలల శిక్షణ
భారత్‌పైకి దాడులకు ఉసిగొల్పే ముందు మూడు నెలలపాటు జైషే మహ్మద్ సంస్థ బాలాకోట్‌లో ఉగ్రవాదులను శిక్షణ ఇచ్చేదని వెల్లడించారు.
ఎకే-47, పైకా, ఎల్ఎంజీ, రాకెట్ లాంచర్, గ్రనేడ్ వంటి అత్యంత ప్రమాదకర ఆయుధాలను ఎలా వాడాలనే దానిపై బాలాకోట్ ఉగ్రవాద శిబిరం శిక్షణనిచ్చే వారని, ఈ శిబిరాన్ని మదర్సా ముసుగులో నిర్వహించేవారని తెలిపింది.
ఆయుధాల వినియోగంతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థ, జీపీఎస్, మ్యాప్ రీడింగ్ వంటి సాంకేతిక విషయాలపైనా ఉగ్రవాదులకు అవగాహన కల్పించే వారని అధికారి వెల్లడించారు. ఈత, కత్తిసాము, గుర్రపు స్వారీలనూ నేర్పించేవారన్నారు.
శిక్షణ సమయంలో ఉగ్రవాద భావజాలాన్ని తీవ్రంగా ఎక్కించేందుకు.... అందుకు సంబంధించిన కొన్ని వీడియోలను చూపిస్తారనితెలిపారు.
బాలాకోట్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కునార్ నది సమీపంలోని ఖైబర్ పక్తుంక్వాలో ఉగ్రవాదుల శిక్షణ శిబిరం ఉంది. దాదాపు 325 మంది ఉగ్రవాదులకు సుమారు 27 మంది శిక్షణ ఇచ్చేవారని అధికారులు తెలిపారు. మరో ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్కూ ఇదే శిక్షణ శిబిరం కేంద్రంగా ఉంటోంది.