భారత్-పాకిస్థాన్ మధ్య తాజా పరిణామాల నేపథ్యంలో యూఏఈ వేదికగా నిర్వహించే ఇస్లామిక్ సహకార సంస్థ-ఓఐసీ సమావేశాన్ని బహిష్కరిస్తామని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ హెచ్చరించారు. సమావేశానికి భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ హాజరైతే తాము పాల్గొనబోమని తెలిపారు.
అబుదబి వేదికగా మార్చి 1-2 తేదీల్లో విదేశాంగ మంత్రుల ఓఐసీ సమావేశ ప్రారంభ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరవ్వాలని సుష్మా స్వరాజ్‌కు ఆహ్వానం అందింది.
"ఓఐసీ, ఏ ఇతర ఇస్లామిక్ దేశంతో నాకు విబేధాలు లేవు. ఓఐసీ సమావేశానికి భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ హాజరు కావటమే సమస్య. సమావేశానికి ఆమె హాజరైతే నేను పాల్గొనను."
- షా మహ్మద్ ఖురేషీ, పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి