"కొంత మందికి కుక్కల గురించి దురభిప్రాయం ఉంది. ఇలాంటి అపోహలు తొలగించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. మీరు జంతువులతో ఒక మంచి బంధం ఏర్పరుచుకోవచ్చు. మీ సందేహాలపై నిపుణుల సలహాలు అడగవచ్చు. వారు మీకు మార్గనిర్దేశం చేస్తారు." _మషల్ఖాన్, జంతు ప్రేమికురాలు
యునైటెడ్ కింగ్డమ్, అమెరికాల్లో నిషేధించిన బుల్ డాగ్స్, అమెరికన్ పిట్ బుల్స్లను సైతం ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ శునకాలు ఎంతో స్నేహంగా ఉంటాయని, సరైన శిక్షణనిస్తే మన ఇంట్లో పెంచుకోవచ్చని వాటి యజమానులు చెబుతున్నారు.