భారత వాయుసేన దాడులపై పాక్ విదేశాంగ శాఖ మంత్రి స్పందించారు. భారత వాయుసేన విమానాలు నియంత్రణ రేఖ దాటి నిబంధనలు ఉల్లఘించాయని ఆయన ఆరోపించారు. భారత దూకుడుకు ప్రతిగా సమాధానం ఇచ్చే హక్కు పాక్‌కు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుత పరిస్థితిపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది. సమావేశ అనంతరం ఖురేషీ ఈ వ్యాఖ్యలు చేశారు.
మొదట వారు పాకిస్థాన్‌పై దూకుడుగా దాడి చేశారు. నియంత్రణ రేఖ దాటి నిబంధనలు ఉల్లఘించారు. మేము కూడా స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటాం. భారత్‌కు సరైన సమాధానం చెబుతాం.తదుపరి కార్యాచరణ పై అత్యవసర సమావేశం నిర్వహించాం.-ఖురేషీ, పాక్ విదేశాంగ మంత్రి