నేపాల్ తప్లీజంగ్ జిల్లా వద్ద జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆ దేశ పర్యటక, పౌర విమానయానశాఖ మంత్రి రబీంద్ర అధికారి మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో పైలట్ సహా ప్రముఖ విమానయాన సంస్థ యజమాని ఆంగ్ సెరింగ్ షెర్పా, ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ అనుయాయుడు యువరాజ్ దాహల్, డీజీసీఏ డిప్యూటీ డైరక్టర్ బీరేంద్ర ప్రసాద్ ఉన్నారు.
వీరంతా పతిబారా దేవాలయాన్ని దర్శించి, అనంతరం చుహన్దందా వద్ద నిర్మిస్తున్న విమానాశ్రయాన్ని పరిశీలించడానికి వెళ్తున్నారు.
పతిబారా ప్రాంతంలో హెలికాఫ్టర్ కూలిపోయింది. పెద్ద శబ్దం వచ్చి, పొగలు కమ్ముకోవడం చూసి స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు.
మంత్రి మరణంతో ప్రధాని ఓలీ మంత్రివర్గంతో అత్యవసరంగా సమావేశమయ్యారు.