ఉత్తర చైనా షాంగ్జీ రాష్ట్రంలోని హౌమా పట్టణంలో సీతాకోక చిలుకల ఆకారంలో ఏర్పడిన మంచు విశేషంగా ఆకర్షిస్తోంది.
"చాలామంది ఇక్కడ పర్యటించారు. ఇక్కడి అందాలను మాత్రం చూడలేకపోయారు. నేను ఈ అందాల్ని ఆస్వాదించడం అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా ఇది సీతాకోకచిలుకను పోలి ఉంది"-లీచి, పర్యటకుడు
సరైన స్థాయిలో ఉష్ణోగ్రత, తేమ కుదరడం, మొక్కలపై వీచే గాలితో అక్కడ అద్భుతమైన అందాలు ఆవిష్కృతమవుతున్నాయి.
తూర్పు చైనా అన్హుయీ రాష్ట్రంలోని హుయాంగ్షాన్ శిఖరం పైనా మంచు రత్నాలతో పొదిగిన రమణీయ దృశ్యాలు 2019లో మొదటిసారిగా ఆవిష్కృతమయ్యాయి.
"అద్భుతమైన మంచు అందాలతో నేను చాలా ఉద్వేగానికి గురవుతున్నాను"-పర్యటకురాలు
షాంగ్జీలోని హుకౌ జలపాతం, ఉత్తర చైనా హెబీ రాష్ట్రంలోని లాంగ్జూ జలపాతం సైతం సూర్య కాంతి మెరుపుల్లో సుందరంగా కన్పిస్తున్నాయి.