టాస్మానియా జనాలు రన్నింగ్ బూట్లను, సైకిళ్లను వదిలేశారు. వ్యాయామం కోసం కయాకింగ్ వైపు అడుగులేస్తున్నారు. ఇతను కయాకింగ్ శిక్షకుడు బెన్ మేనార్డ్. సాధకులకు సూచనలిస్తున్నారు.
"కొంత నెమ్మదిగా నడపండి. బ్లేడ్పై ఒత్తిడి పడనివ్వాలి, మీ పడవను శుభ్రంగా ఉంచుకోండి"-బెన్ మేనార్డ్
ఉదయం 6 గంటలకే సాధన ప్రారంభమవుతుంది. క్రీడా నైపుణ్యాన్ని పెంచుకునేందుకు, సాంకేతిక నైపుణ్యాల్ని పెంచుకునేందుకు ఈ సమయం ఎంతగానో ఉపకరిస్తోంది. ఓ సాధారణ పడవ విలువ 1260 నుంచి 4200 అమెరికన్ డాలర్లు.
"కయాకింగ్ వల్ల కొంత వ్యాయామం లభిస్తోంది. మీకు మీరే చిన్న చిన్న సాహసాలు చేస్తూ ఉంటారు." కయాక్ సాధకుడు.
స్థానిక అధికారులు కయాకింగ్పై ఆదాయ వనరుగా మార్చేందుకు యోచిస్తున్నారు. కయాకింగ్ చేసేందుకు వీలుగా 190 కిలోమీటర్ల తీరాన్ని సిద్ధం చేశారు.
"ఇది మొత్తం కుటుంబం పాల్గొనేలా ఉండటం వల్ల తక్కువ సమయంలోనే ప్రాచుర్యం పొందింది. దీనికి వయో భేదమేమీ లేదు."-జాట్సన్
ఆస్ట్రేలియా జాతీయ పాడ్లింగ్ క్రీడా సమాఖ్య లెక్కల ప్రకారం 3.6 మిలియన్ల జనాభా ఏటా ఈ క్రీడను సాధన చేస్తున్నారు. కానీ ఈ క్రీడలో అందరూ విస్మరించే అంశం భద్రత. కయాకింగ్ క్రీడలో ఇటీవల సంవత్సరాల్లో ఒకే ఒక్క మరణమే నమోదైనప్పటికీ అనారోగ్యాలకు గురయ్యే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.
"విక్టోరియాలో నీట మునిగి మునిగిపోయిన వాళ్లలో 18 శాతం మంది కయాక్ సాధకులే. అక్కడే ఇది మొదలవుతోంది."-గ్రిగ్స్
ఆస్ట్రేలియన్లు, టాస్మానియా వాసుల కయాక్ అనుభూతిని మాటల్లో వర్ణించలేం.