షూటింగ్ ప్రపంచకప్లో పాల్గొనాల్సిన పాక్ షూటర్లకు భారత్ వీసాలను నిరాకరిచడంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతర్జాతీయ క్రీడల నిర్వహణపై భారత్తో చర్చలను రద్దు చేసుకుంటున్నట్టు వెల్లడించింది.
పుల్వామా ఉగ్రదాడి కారణంగా షూటింగ్ ప్రపంచకప్లో పాల్గొనాల్సిన పాక్ క్రీడాకారులకు వీసాలు నిరాకరించింది భారత్.
లిఖితపూర్వక హామీ ఇస్తే...
ఒలింపిక్ కమిటీ నిబంధనలను పూర్తిగా అమలు చేస్తామని, క్రీడాకారులందరికీ వీసా ఇస్తామని భారత ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇచ్చేవరకు భవిష్యత్తులో మరే ఇతర ఒలింపిక్ సంబంధిత క్రీడలు భారత్లో జరగబోవని ఐఓసీ చెప్పింది.
పుల్వామా ఉగ్రదాడిలో కారణంగా పాక్ షూటర్స్ను ప్రపంచకప్లో పాల్గొనకుండా చేయడం సబబు కాదని ఐఓసీ అభిప్రాయపడింది. భారత్లో జరిగే ఆ టోర్నమెంట్లో ఇద్దరు పాక్ షూటర్లు పాల్గొనాల్సి ఉంది.
ఒలింపిక్ నియమాలకు ఇది విరుద్ధమని ఒలింపిక్ కమిటీ పేర్కొంది. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు సమన్యాయం కల్పించాలని తెలిపింది.
ఇది కూడా చదవండి: