అణ్వాయుధాలున్న రెండు దేశాల మధ్య చర్చలతోనే సమస్య పరిష్కారమవుతుందని ఉద్ఘాటించారు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్. భారత్‌కు చెందిన రెండు మిగ్ యుద్ధవిమానాలు నియంత్రణ రేఖను దాటి పాక్‌లోకి ప్రవేశించాయని, వాటిని కూల్చివేశామని చెప్పారు. భారత విదేశాంగ శాఖ దిల్లీలో ప్రకటన చేసిన కొద్ది నిమిషాలకే పాక్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
''ఒకవేళ మీరు మా దేశంలోకి వస్తే మేం అదే చేస్తాం. ఇదే మా ప్రతిస్పందన'' - ఇమ్రాన్ ఖాన్, పాక్ ప్రధాని
ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలే ఉత్తమ మార్గమని అభిప్రాయపడ్డారు ఇమ్రాన్.
'' పుల్వామా ఘటన దర్యాప్తుకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని భారత్‌ను ఎన్నోసార్లు అడిగాం. మనం తెలివితో ఆలోచించాల్సిన అవసరముంది. ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. చాలా యుద్ధాల్లో అంచనాలు తప్పాయి. ఒకసారి ప్రారంభమైతే ఎక్కడికి దారితీస్తుందో తెలియదు. మనం అలాగే అంచనా తప్పితే నా చేతుల్లో, మోదీ చేతుల్లో ఏమీ లేదు. చర్చలకు సిద్ధమని భారత్‌కు మరోసారి స్పష్టం చేస్తున్నా.''
- ఇమ్రాన్ ఖాన్, పాక్ ప్రధాని