ETV Bharat / asia-pacific

భారీ బ్యాటరీ ఫోన్  ఇదిగో.. - p18k

18,000 ఎమ్​ఏహెచ్ బ్యాటరీ గల ఫోన్​ని తీసుకొస్తోంది ఎనర్జైజర్ సంస్థ. దీని బ్యాటరీ సామర్థ్యంతో ఏకబిగువున రెండు రోజులపాటు వీడియోలు వీక్షించవచ్చు.

అతిపెద్ద బ్యాటరీ ఫోన్
author img

By

Published : Feb 27, 2019, 10:04 AM IST

ప్రస్తుతం స్మార్ట్​ఫోన్లు విరివిగా వాడుతున్నారు. చరవాణిలన్నింటిలోనూ అతిపెద్ద సమస్య బ్యాటరీ సామర్థ్యం. 3000,4000 ఎమ్​ఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీలే ఓ మోస్తరుగా వాడుకోవచ్చు. అయితే త్వరలో 18,000 ఎమ్​ఏహెచ్ బ్యాటరీ గల ఫోన్​ రాబోతుంది. ఎనర్జైజర్ సంస్థ ఈ ఫోన్​ను తీసుకువస్తుంది.

స్పెయిన బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2019లో పవర్ మ్యాక్స్ P18కే ఫోన్​ను పరిచయం చేసింది ఎనర్జైజర్ సంస్థ. ఇప్పటికే ఫోల్డబుల్ ఫోన్లు, అతిపెద్ద మెమరీ కార్డులను ఇక్కడ విడదల చేశారు. తాజాగా ఈ లిస్టులో ఈ భారీ బ్యాటరీ చరవాణి చేరింది.

ENEGIZER
అతిపెద్ద బ్యాటరీ ఫోన్

పవర్ మ్యాక్స్ P18కే ఫోన్ బ్యాటరీ సామర్థ్యంతో వారం రోజుల పాటు వాడుకోవచ్చు. ఏకబిగువున రెండు రోజులపాటు వీడియోలు వీక్షించవచ్చు. 18,000 ఎమ్​ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం గల ఈ ఫోన్​లో చార్జింగ్ ఫుల్ అవ్వడానికి 8 గంటల సమయం పడుతుంది.

6.2 అంగుళాల తెరతో ఎల్​సీడీ డిస్​ప్లేని కలిగిఉంది. రెండు సెల్ఫీ కెమెరాలు, వెనక వైపు మూడు కెమెరాలతో ఆండ్రాయిడ్ 9పై వర్షన్​తో ఆకర్షిస్తుంది. మీడియాటెక్ ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, 128 జీబీ అంతర్గత నిల్వ సామర్థ్యాన్ని కలిగిఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ సామార్థ్యం కలిగిన ఎనర్జైజర్ పవర్ మ్యాక్స్ P18కే చరవాణి వేసవిలో అందుబాటులోకి వస్తుంది.

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.